బాపు నుంచి బాపు నుంచి బాపు దాకా
---------------------------------------------------------------------------------- ముళ్లపూడి వెంకటరమణ
"వత్పా ! వరం కోరుకో"
"ఎందుకు ? "
"బి.ఎల్ చదివి లాయరు వయ్యావు గదా "
"అయితే ?"
"ప్రాక్టీసు పెట్టాలి గదా "
"పెడితే ?"
"గొప్పలాయరువై కోట్లు గడిస్తావా - గొప్ప జడ్జీపై కీర్తి గడిస్తావా - వరం కోరుకో"
"నా ప్రాక్టీసు అదికాదు"
"మరి లా యెందుకు చదివినట్టు ? "
"తండ్రి ఆజ్ఞ తలదాలిచి"
"ప్రాక్టీసు పెట్టకపోతే తండ్రి ఆజ్ఞ తప్పినట్టు కాదా ?-
"తండ్రి ఆజ్ఞ లాయరు చదవడం వరకే ప్రాక్టీసుకు ఇది వర్తించదు.
"ఇంతకీ ఏం ప్రాక్టీసు చేస్తావు ?"
'ఇదీ' అని అట్టమీద వేసిన సరస్వతి బొమ్మని చూపించాడు బాపు.
చదువుల తల్లి సంతోషించింది.
"అరె నాతో మాట్లాడుతూనే నా బొమ్మ గీశావే "
"వాతో మాట్లాడుతూనే నువ్వు వీణ వాయిస్తున్నావు కదా "
"చమత్కారివే సరేకాని - బొమ్మలు అని ఒక్క మాటలో చెప్పావు. చిత్రకళ సముద్రమంతటిది. అందులో ఎన్ని విధాలున్నాయో - ఆయిల్ పెయింట్స్, వాటర్ కలర్స్, పెన్ & బ్రష్ వాష్ పెయింటింగ్స్లో రవివర్మ, చామకూర్, దామెర్ల, భాగీరథి, మొక్కపాటి, పిలకా, వైకుంఠం, పైడిరాజు - ఇలా ఎందరో... రేఖా చిత్రాల్లో బాపిరాజు, తలిపెట్టి, వపా తెల్లదొరల్లో డావిన్సీ, మైకేలేంజలో, నార్మన్ రాక్వెల్, హోగార్త్ - కార్టూనుల్లో షూల్జ్, కెచామ్ - శిల్పంలో రోడావ్ (RODIN) రాయ్ చౌధురి - ఇలా ఎన్నో శాఖలు - ఎందరో మహామభావులు.............