• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Basha Samajam Samskruthi

Basha Samajam Samskruthi By Badri Raju Krishnamurty

₹ 350

అవతారిక

తెలుగులో భాషాధ్యయనానికి, భాషాపరిశోధనకు విశిష్టమైన చరిత్ర ఉంది. ఆధునికయుగం ప్రారంభదశలో భాషాగతమైన అధ్యయనాలు, పరిశోధనలే ప్రముఖంగా జరిగాయి. వలసపాలనక్రమంలోనే అయినా సాంస్కృతికరంగంలో భాషకు సంబంధించిన నవీకరణ ఆధునికతాపరిణామంలో ప్రధానాశం అయింది. క్రీ.శ. 1857కు ముందు ఇంగ్లీషువాళ్ళ పరిపాలనలో కూడా అర్జీలు, ఉత్తర | ప్రత్యుత్తరాలు మొదలైనవి తెలుగులోనే నడిచేవి. 1812లో మద్రాసులో ఫోర్ట్ సెయింట్ | జార్జ్ కళాశాల స్థాపన తరువాత ఎ.డి. క్యాంప్బెల్ మొదలు సి.పి.బ్రౌన్ దాకా తెలుగు | భాషకు వ్యాకరణాలు రాశారు. ఆధునిక పద్ధతిలో నిఘంటువులను నిర్మించారు. ఈ కాలంలోనే పఠన పాఠనాలకు వచనగ్రంథాలు తయారయ్యాయి. దేశీయపండితులూ | ఈ కృషిలో పాలుపంచుకున్నారు. తెలుగునాట సామాజికభావవిప్లవానికి ఆద్యుడని చెప్పుకోవలసిన సామినేని ముద్దునరసింహనాయుడు 1850లలోనే తెలుగు ఆధునిక భాషా స్వరూపాన్ని గురించి చర్చించాడు. 1816లో ప్రచురితమైన క్యాంప్బెల్ తెలుగు వ్యాకరణంతో, ఆ సందర్భంలోనే విలియమ్ వైట్ ఎల్లిస్ తెలుగుపైన రాసిన పరిశీలన | వ్యాసంతో ద్రావిడభాషల తులనాత్మక అధ్యయనానికి బీజం పడింది. 1856లో బిషప్ | కాల్డ్వెల్ ద్రావిడభాషల తులనాత్మకవ్యాకరణంతో దానికో రూపం ఏర్పడింది.

తెలుగుశాసనాల పరిశీలన చరిత్రరచనకే కాదు, భాషాధ్యయనానికి కూడా | దోహదం చేసింది. 1924లోనే ప్రఖ్యాతపరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖరశర్మ తన చరిత్రపరిశోధనలో భాగంగా 'ప్రాచీనాంధ్రభాషాస్వరూపము' అన్న వ్యాసాన్ని ప్రకటించాడు. కాల్డ్వెల్ మార్గంలో ద్రావిడభాషల ప్రత్యేకకుటుంబవాదాన్ని అంగీకరించిన కోరాడ రామకృష్ణయ్య 1929లో శాసనాలు ఆధారంగా 'నన్నయకు | పూర్వము ఆంధ్రభాషాస్థితి' అన్న వ్యాసం రాశాడు. సంధి, దేశి, భాషోత్పత్తి క్రమము | మొదలైన గ్రంథాలు కోరాడకు ద్రావిడభాషల తులనాత్మక అధ్యయనం మీద ఉన్న అధికారాన్ని సూచిస్తాయి. నన్నయకు చాలా కాలానికి ముందే తెలుగు | కావ్యభాషాస్వరూపం స్థిరపడిందని ఆయన మొదటిసారిగా గుర్తించాడు. తెలుగులో చరిత్రపరిశోధనకు మూలపురుషుడైన కొమర్రాజు లక్ష్మణరావుకు సమకాలంలో వస్తున్న ద్రావిడభాషల పరిశోధనతో పరిచయం ఉన్నట్టు ఆయన రచనలు స్పష్టం.............

  • Title :Basha Samajam Samskruthi
  • Author :Badri Raju Krishnamurty
  • Publisher :Neelkamal Publications pvt ltd
  • ISBN :MANIMN4470
  • Binding :Papar back
  • Published Date :2023 7th print
  • Number Of Pages :301
  • Language :Telugu
  • Availability :instock