జానపద వాజ్మయం - స్త్రీల పాటలు పల్లెజనుల యొక్క పదవాజ్మయమే జానపద వాజ్మయం. పూర్వకాలంలో స్త్రీలు ఇంటి పనులు, వ్యవసాయపనులు వారి కాయకష్టంతో చేసుకునేవారు. యంత్రాలు అందుబాటులో లేని పల్లెవాసులు ఎవరిండ్లలో శుభకార్యాలు జరిగినా, పండగలు వచ్చినా ఒకరి కొకరు సాయం చేసుకుని ఆనందంగా జీవించేవారు. వారి యొక్క కాయకష్టం మరచి ఆనందంగా పనిపూర్తి చేసుకోవటానికి ఆశుకవిత్వంగా పదములు అల్లుకుని పాటలుగా పాడుకునే వారు. కష్టసమయాలలోను, సుఖసమయంలోను కూడా ఆ సమయానికి తగినట్లు, ఇతిహాసములలోని ఘట్టాలను, సామాన్య జనులలోకి తీసుకువచ్చే ప్రయత్నం ఆనాడే చేసారు అనడానికి ఈ జానపద వాజ్మయమే నిదర్శనం.
ఇంకా ఆ పల్లెజనుల పదవాజ్మయము, ఆధునిక కాలంలోను ఆ జనుల యొక్క మనోభావాలను ప్రతిబింబింప చేస్తున్నదనడంలో ఎటువంటి సందేహంలేదు. పండుగలు, పబ్బములలోను, ఉత్సవాల లోను, జాతరల లోను, ఇతర ఏవేడుకలలోనైనా ఈ జానపద గేయములు యొక్క ప్రాధాన్యత కనబడుతూనే వున్నది. పల్లెజనులు పాడుకునే పాటలనే జానపద గేయాలని కొంతమంది కవులు వారి అభిప్రాయములను వ్యక్తం చేసినారు. వారు లయబద్దంగా పదములు అల్లుకుని పాడడం వారి భావనాత్మక సృజనకు జోహార్లు చెప్పవలసిందే. పాతరోత, కొత్తవింత సామెత, ఇప్పటి కాలంలో కొత్త రోత పుట్టిస్తోంది పాతే వింతగా వుంది. ఆవాజ్మయముమీద ఆధునిక కాలంలోని జనులు మక్కువ చూపుతున్నారు అంటే వారు ఎంతగా పురాణ గాధలను అర్థంచేసుకొన్నారో అర్థమవుతుంది. జనజీవనం లోను జరుగుతున్న మంచి, చెడులను వారు పాటలగా అల్లుకుని సందర్భాను సారంగా పాడుకునే వారు. మానవుని నాగరికతకు, సంస్కృతికి ఈ జానపద గేయాలు దర మయినాయి...........