టచ్
“నీ చేతిని ఒకసారి టచ్ చేయొచ్చా" అతని చిన్ననాటి ఫోటోలు చూస్తున్నదల్లా ఆపి హఠాత్తుగా అడిగింది ఆమె. అలా అడుగుతూ అతని మొహంలోకి చూసింది.
అది అతను ఊహించని ప్రశ్న. సూటిగా ఆమె కళ్ళలోకి గుచ్చి గుచ్చి చూసాడు.
ఆ చూపుల్లో అనేక ప్రశ్నలు కనిపించాయి ఆమెకు.
వాటికి సమాధానం చెప్పలేని ఆమె తల వాలింది.
అక్కడున్న ముగ్గురి మధ్య పైకి వినిపించని మాటల ప్రవాహం నిశ్శబ్దంగా... రకరకాల భావోద్వేగాల సమ్మేళనంతో కొట్టుమిట్టాడుతున్న అతని హృదయం వేగంగా కొట్టుకుంటున్నది.
ఆమె అడిగిన తీరు అతని హృదయాన్ని తాకి చలింపజేస్తూన్నది.
అగ్నిపర్వతం బద్దలై అతలాకుతలం అయిన సముద్రంలాగా అతను.
ఆ కడలి తరంగ లోతుల్లోకి చూడ ప్రయత్నిస్తూ ఆమె.
కానీ అది సాధ్యమా...
అడగకూడనిది కాదుగా... ఆచూపులకు అర్థం ఏమనుకోవాలి? సీమటపాకాయ లాగా ఎగిరిపడేవాడు మౌనిలాగా... ఇద్దరినీ మార్చి మార్చి చూస్తున్న ముసలమ్మ.
ఏళ్ళ తరబడి ఘనీభవించిన అశాంతి, ఉక్కపోత, జీవన ఘర్షణ ముగ్గురిలో.............