• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Bathuku Sedyam

Bathuku Sedyam By V Shanthi Prabodha

₹ 330

బతుకు సేద్యం అనే నవలాసేద్యం

శాంతి ప్రబోధ రాసిన 'బతుకు సేద్యం' నవల ఆమె పూర్వపు నవల వలే అతి క్లిష్టమైన సామాజిక సమస్య గురించినది. భూమితో, స్త్రీలతో, పర్యావరణంతో సంబంధం కలిగినది. ఈ నవల చదవటం మొదలు పెట్టిన కొద్దీ సేపటిలో నాకు బాగా పరిచయమైన విషయంవలే అనిపించింది. నిజమే, హైదరాబాదు దాని సమీప జిల్లాలలో గ్రామీణాభివృద్ధి గురించి తెలిసిన వారందరికీ ఆసక్తి కలిగించే విషయం. ఆసక్తి ఉన్న వారందరికీ తెలిసే విషయం. దాన్నలా ఉంచి నవలా ఇతివృత్తం గ్రామీణాభివృద్ధి, గ్రామ అంటే గ్రామం లోని ప్రజల అని ఇవాళ మనకు తేలికగా అర్ధమవుతుంది గానీ మరొకసారి జ్ఞప్తికి చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాలకు చాలాసార్లు గ్రామం అంటే ప్రజలని కాక ఇతర వనరులని మాత్రమే అర్ధమవుతున్న కాలంలో బతుకుతున్నాం. ప్రజలలో కూడా వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు, ఆ కుటుంబాలలో మరింత ఆకలికి, చాకిరికి, అణచివేతకు గురవుతున్న స్త్రీలు గ్రామాలలో ముఖ్యులు. వారే గ్రామాన్ని కాపాడుతున్నారు. కుంటినడక నైనా నడిపిస్తున్నారు. ఐతే ఆ గ్రామీణ స్త్రీల గురించి స్వతంత్రం వచ్చిన చాలాకాలం వరకూ ఎవరికీ పట్టలేదు. స్వాతంత్య్రానంతర అభివృద్ధి ప్రణాళికలలో, కార్యక్రమాలలో ఆ నిరుపేద గ్రామీణ స్త్రీలకు చోటు దొరకలేదు...........

  • Title :Bathuku Sedyam
  • Author :V Shanthi Prabodha
  • Publisher :Chayya Resources center
  • ISBN :MANIMN4001
  • Binding :Papar back
  • Published Date :Dec, 2022
  • Number Of Pages :360
  • Language :Telugu
  • Availability :instock