• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Beetalu Vaarina Swetcha

Beetalu Vaarina Swetcha By Padmaja Sha

₹ 250

మొదటిభాగం
 

ఒక ప్రారంభం, ప్రతిక్రియలు, ప్రతిస్పందనలు

నన్ను సెప్టెంబర్ 2009లో అరెస్టు అయ్యే పరిస్థితికి తెచ్చిన నేను ఎంచుకున్న ఎటువంటిది? మావోయిస్టులకు సంబంధించిన కేసుల్లో నేను పదే పదే నిర్దోషిగా రుజువైనప్పటికీ, నా జీవితంలో 15 శాతం భారతదేశపు జైళ్ళల్లో గడిపింప జేసిన కార్యాచరణ ఎటువంటిది?

ఈ భాగంలో నా భార్య అను, నేను ఎంచుకున్న దారికి గల నేపథ్యాన్ని చెప్తాను. మా కుటుంబాలు ఇతర ఉన్నత మధ్య తరగతి వర్గకుటుంబాల వంటివే. ఇతర ధనిక పార్సీ యువత లాగానే నేను కూడా ఈ స్పృహ కలగకముందు సమాజం గురించి ఏమీ అవగాహన లేకుండా వుండేవాడిని. అను కుటుంబం కొంత కమ్యూనిస్టు భావజాలం వైపు మొగ్గినా, తన కుటుంబంలో ఉదారభావాలు వుండటం ఆమె చురుకైన మేధస్సులో తొణికేది. అయినా కాని ఆమె బాల్యం స్వేచ్ఛగా గడిచి, కాలేజిలో అందరి లాగా సరదాగా వుండేది. మమ్మల్ని ఏమి మార్చివేసింది? అదీ అంత సమూలంగా? ఈ రాజకీయాల వైపు మమ్మల్ని ఏం నడిపించింది?

నా నిర్బంధకాలం మొత్తంలో నాకు జైలు డైరీ రాయాలనే ఉద్దేశమే లేదు. కానీ సూరత్లో నా నిర్బంధం ఆఖరి రోజుల్లో ఎక్కడైతే ఒక నెలన్నర గడిపానో, అప్పుడు నా గతం గురించి ఆలోచించటం మొదలుపెట్టాను. కొన్ని నోట్స్ రాసుకున్నాను. నాకు తట్టిన మొదటి ఆసక్తికరమైన జ్ఞాపకం 1971లో నేను లండన్లో అరెస్ట్ అయిన విషయం. అప్పటికి నా వయస్సు 24 ఏళ్ళు..............

  • Title :Beetalu Vaarina Swetcha
  • Author :Padmaja Sha
  • Publisher :Vishalandra Publishing Housing
  • ISBN :MANIMN6033
  • Binding :Paerback
  • Published Date :Jan, 2025
  • Number Of Pages :247
  • Language :Telugu
  • Availability :instock