• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Benjamin Franklin

Benjamin Franklin By Nanduri Vithal Babu

₹ 150

బెంజమిన్ ఫ్రాంక్లిన్ స్వీయ చరిత్ర

డియర్సన్

. పూర్వీకులను గురించిన వింతలూ విశేషాలూ తెలుసుకోవటం - నాకు చాలా ఆనందం కలిగించే విషయం. నువ్వు ఇగ్లండులో వున్నప్పుడు - మన బంధువుల్ని గురించిన సంగతి సందర్భాలన్నీ తెలుసుకోవటం కోసం - నేను చేసిన కృషి - నీకు తెలిసిన విషయమే. ఆ ప్రయత్నంలో నేను అనేక ప్రయాణాలు కూడా చేశాను.

అలాగే నా జీవిత స్థితిగతులను తెలుసుకోవటం నీకూ సంతోషం కలిగిస్తుందనే అనుకుంటా. నేను చవిచూచిన అనేక సంఘటనల వివరాలు యింతవరకూ నీకు తెలియదు. ఈ పల్లెప్రాంతంలో ఒక వారం విశ్రాంతి తీసుకుందామని వచ్చాను. ఈ వారంలో నీకు అనేక విషయాలు వ్రాయదల్చుకున్నాను.

నేను బీదరికంలో అనామకమైన కుటుంబంలో జన్మించాను. ఆ అంధకారంలోంచి బయటకొచ్చి, పేరు ప్రఖ్యాతులు గడించి జీవితంలో చెప్పుకోతగ్గంతగా ఆనందానుభూతుల్ని చవిచూచినవాణ్ణి.

భగవానుని ఆశీస్సులతో - ఏవిధంగా నేను జీవితంలో పురోగమించానో, ముందు తరాలవారు తెలుసుకోవటానికి కుతూహల పడవచ్చు.

అందులో కొన్ని విషయాలు వారి వారి జీవిత సమస్యలను కొంతవరకూ పరిష్కరించు కుంటానికి ఉపయోగపడవచ్చు.

నేను జీవితంలో చవిచూచిన ఆనందానుభూతుల్ని జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడల్లా - మళ్ళీ జీవితం పునరావృతమైతే బాగుండుననిపిస్తుంది. రెండో ప్రచురణలో రచయితలు కొన్ని పొరపాట్లు సర్దుకుంటున్నట్లు, నేను కూడా నా జీవితాన్ని పదింతలు సలక్షణంగా తీర్చిదిద్దుకునేవాణ్ణి.

ఇది ప్రయోజనంలేని కోరిక అని నాకూ తెలుసు. అలా జీవితం ఎవరికీ ఏనాడూ పునరావృతం కాదు. కాని గత జీవితాన్ని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుని, కొంత సంతృప్తి....................

  • Title :Benjamin Franklin
  • Author :Nanduri Vithal Babu
  • Publisher :Classic Books
  • ISBN :MANIMN6214
  • Binding :Papar Back
  • Published Date :April, 2025
  • Number Of Pages :139
  • Language :Telugu
  • Availability :instock