• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Bertrand Russell

Bertrand Russell By Dr D Chandrashekar Reddy

₹ 100

రసెల్ జీవిత పరిచయం

ఇరవయ్యో శతాబ్దంలో బెర్ట్రాండ్ రసెల్ అంతగా తీవ్ర దూషణ భూషణలకు గురి అయిన తత్వవేత్త మరొకరు లేరు.

మహామేధావిగా, మానవతావాదిగా, శాంతిదూతగా, గణితశాస్త్రవేత్తగా ఆయన ఎలాంటి గౌరవసత్కారాలు అందుకున్నాడో - సంప్రదాయ నీతులను గౌరవించలేదని మతాధికారులు ప్రచారం చేసే మూఢనమ్మకాలను గౌరవించలేదనీ, అంతటి అవమానాలకు గురి అయ్యాడు.

కాని, వోల్టేర్ (Voltaire), జాన్ స్టూవార్ట్ మిల్ (J.S. Mill) తర్వాత వ్యక్తి స్వేచ్ఛకు అంతటి ప్రాధాన్యతను యిచ్చిన తత్వవేత్త మరొకరు లేరు.

98 సంవత్సరాలు జీవించి, విక్టోరియన్ యుగపు నీతుల నుండి, వియత్నాం యుద్ధ సమస్య వరకూ - మానవుడిలోని దానవుడితో నిర్విరామంగా పోరాడుతూనే వచ్చాడు. వృద్ధాప్యంలో వుండగా అతడిని చెరసాలలో పెట్టారు. అతడి లైబ్రరీని జప్తు చేశారు. అమెరికాలో ప్రొఫెసర్గా ఉండగా, అతడి ఉద్యోగాన్ని ఊడగొట్టారు. అతడు రాసిన 'మేరేజ్ అండ్ మోరల్స్' (Marriage and Morals) పుస్తకం ప్రపంచంలో కెల్లా అసభ్య గ్రంథంగా ప్రకటించారు. కాని, తర్వాతి కాలంలో ఈ గ్రంథ రచయితకు సాహిత్యానికి యిచ్చే నోబెల్ బహుమతిని యిచ్చారు.

ఇంతటి విలక్షణ, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రసెల్ - వివిధ విషయాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలను తెలపడం ఈ పుస్తకం లక్ష్యం.

ఆ విషయాలను తెలుసుకునే ముందు అతడి జీవితాన్ని సంక్షిప్తంగా తెలుసుకుందాం. బెర్ట్రాండ్ రసెల్ పూర్తి పేరు - బెర్ట్రాండ్ ఆర్థర్ విలియమ్ రసెల్. ఇతడు 1872 మే 18వ తేదీన జన్మించాడు. తండ్రి విస్కెంట్ ఏంబర్లీ, తల్లి.......................

బెర్ట్రాండ్ రసెల్ జీవితం, దృక్పథం

7

  • Title :Bertrand Russell
  • Author :Dr D Chandrashekar Reddy
  • Publisher :Emesco Publications
  • ISBN :MANIMN5846
  • Binding :Paerback
  • Published Date :2024
  • Number Of Pages :124
  • Language :Telugu
  • Availability :instock