బేతాళ కథలు
గోదావరీతీరాన ప్రతిష్ఠానమనే నగరం ఉండేది. దానిని ఒకప్పుడు విక్రమార్కుడనే రాజు పాలించేవాడు. విక్రమార్కుడి అస్థానానికి రోజూ క్షాంతి శీలుడనే భిక్షువు వచ్చి, పండు ఒకటి కానుకగా ఇస్తూ ఉండేవాడు. రాజు ఆ పండును కోశాధికారికి ఇస్తూ ఉండేవాడు.
ఒకనాడు భిక్షువు తన అలవాటు ప్రకారం రాజుకు ఒక పండు ఇచ్చి వెళ్ళిపోయాడు.
సమయంలో ఒక కోతి ద్వారపాలకులను తప్పించుకుని రాజసభలోకి వచ్చింది. భిక్షువు ఇచ్చిన పండును రాజు ఆ కోతికి ఇచ్చాడు. కోతి ఆ పండును తినే సరికి పండులో నుంచి వెలలేని రత్నం ఒకటి కింద పడింది...................