భగవద్గీత
మీ వాక్కుకి ప్రకృతిని శాసించగలిగే శక్తి కలగాలి అంటే అన్నది అన్నట్లుగా తక్షణమే ఆచరణలో పెట్టండి. దానినే పూర్వకాలంలో అస్త్ర విజ్ఞానం అనేవారు. రానున్న కలియుగాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో ఈ అస్త్రవిద్యని తీసేశాడు. ఆయన చేసిన అద్భుతమైనటువంటి మోసం ఏమిటి అంటే అక్షర జ్ఞానాన్ని, మంత్ర జ్ఞానాన్ని, అస్త్ర జ్ఞానాన్ని భగవద్గీతలో కీలితం చేశాడు. అందుచేత భగవద్గీతలో చెప్పిన భావాలను మెల్లిమెల్లిగా మన మనస్సులో సాధించగలిగితే, అస్త్ర విజ్ఞానం మనలో దానంతట అదే ఉద్భవిస్తుంది.
ఆధ్యాత్మిక జగత్తులో భగవద్గీత యొక్క స్థానం మన అందరికీ తెలిసినదే కాని ఆధ్యాత్మికత అంటే ఏమిటో మనకి తెలియదు, తమాషా అది. ఆధ్యాత్మికత అంటే సాధారణంగా చాలా మందికి ఉండే అవగాహన, ఉద్దేశ్యం రెండు రకాలుగా ఉంటాయి. భౌతిక జగత్తులో కావలసింది పొందలేకపోతే అంటే భౌతిక జగత్తులో ఫెయిల్యూర్ అయినప్పుడు ఆధ్యాత్మికత గురించి ప్రయత్నం చేస్తాం లేకపోతే భౌతిక జగత్తులో.................