• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Bhagavadgeetha Yadardha Parisilana

Bhagavadgeetha Yadardha Parisilana By B Sambasivarao

₹ 130

రాసిందెవరు? ఎప్పుడు?

కౌరవపాండవుల సేనలు రెండు వైపులా నిలిచి యుద్ధానికి ఉత్సాహపడుతున్న సమయంలో కృష్ణుడు అర్జునునికి చేసిన ఉపదేశమే గీతాశాస్త్రం' అని హిందువులందరూ నమ్ముతున్న విషయం. ఆ గీతాకారుడు' కూడా కృష్ణుడేనని చెప్పుకుంటారు. కానీ ఇది వాస్తవవిరుద్ధమైన విషయం. ఎందుకంటే భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు 18 అధ్యాయాలుగా విభజించబడి ఉన్నాయి. (కొన్ని ప్రతుల్లో 745 శ్లోకాలు కూడా ఉన్నాయి). ఇందులోని మొదటి అధ్యాయమే అతనిది కానప్పుడు గీతరచన కృష్ణునిదే అని ఎలా అనుకోగలం?

రెండో విషయం- కృష్ణార్జునులు కురుక్షేత్ర యుద్ధభూమిలో ఒకరినొకరు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో 'సంజయుడు' ఎలా ప్రవేశించగలడు? 411, శ్లోకాలు సంజయుడు చెప్పినట్లుగా గీతలో ఉన్నాయి. (745 శ్లోకాలు గల ప్రతుల్లో వీటి సంఖ్య 67)

మూడో విషయం - కృష్ణుడే 'గీతా'కర్త అయితే, అతడు తనను గురించి మాట మాటికి 'భగవానువాచ' (దేవుడు చెప్పెను) అని ఎందుకు చెప్పుకుంటాడు? "నేను ఇలా "చెప్పాను" అని రాసుకోవాలి కదా? కృష్ణుడు తన గురించి చెప్పుకుంటూ 'నేను' (అహం) అనే పదాన్ని 620 శ్లోకాలలో 375 సార్లు (745 శ్లోకాల భగవద్గీత ప్రకారం) వాడాడు.

భగవద్గీతరచయితను గురించి ప్రముఖహిందూ తాత్వికపండితుడు డాక్టర్ సర్వేపల్లి. రాధాకృష్ణన్ ఆ పుస్తకపీఠికలో ఇలా అన్నారు. "గీతరచయిత ఎవరో తెలుసుకోవడానికి మనకు ఏ ఆధారాలు లేవు. భారతీయసాహిత్యప్రారంభదశలో దాదాపు ఏ పుస్తకంలోనూ గ్రంథకర్తల పేర్లు లేవు. మహాభారతాన్ని రాసిన వ్యాసుడే గీతరచయిత అయి ఉంటాడని అంటున్నారు."

మహాభారతకర్త వ్యాసుడు అని అందరూ ఎరిగినదే. అందులోనే భగవద్గీత కూడా 'ఉంది. కానీ ఆ 'గీత' ను రాసిన వాడు మాత్రం మహాభారతాన్ని రాసిన వాడు కానీ, కనీసం చదివినవాడు కానీ అయి ఉండదు. ఎందుకంటే మహాభారతాన్ని గురించి చేసిన ప్రస్తావనలు భగవద్గీతలో చాలా తప్పులతో ఉన్నాయి. కొన్ని చూడండి -...............

  • Title :Bhagavadgeetha Yadardha Parisilana
  • Author :B Sambasivarao
  • Publisher :Swechalochana Prachuranalu
  • ISBN :MANIMN5415
  • Binding :Papar Back
  • Published Date :April, 2022
  • Number Of Pages :125
  • Language :Telugu
  • Availability :instock