• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Bhagavathgeetha Oka Avalokana

Bhagavathgeetha Oka Avalokana By Vivina Murty

₹ 180

1వ అధ్యాయం

చారిత్రక నేపథ్యము

భగవద్గీత గురించి విస్తృతమైన చర్చ ఉంది. ఈ మూలగ్రంథానికి సాంస్కృతిక పరమైన విశ్లేషణలోకి దిగేముందు ఈ గ్రంథం నిర్మించబడిన చారిత్రక- సామాజిక నేపథ్యాన్ని పక్కన పెట్టడం అసంభవం. ఈ రకమైన దృష్టికోణంతో చర్చించటం ఇంతకు ముందు కన్న ఇప్పుడు మరీ అవసరం.

మనదేశంలో చర్చలకి కొదవలేదు. అలాగే చర్చా విషయాలకీ కొదవ లేదు. అలాంటి విషయాలలో భగవద్గీత ప్రముఖమైనది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలూ ముఖ్యమైనవే కాని భగవద్గీత మొదటిస్థానం. ఉత్తరభారతంలో గీత, కులసీదాసు రామాయణాలది. సంయుక్తంగా అగ్రస్థానం. నిత్యానందుడు, అనుభవానందుడు, సుఖాత్యానందుడు వంటి ఆనందులు గీతలోని ప్రతి అధ్యాయానికి రెండు వారాలకు తక్కువ కాకుండా ప్రవచనం. చెప్పగలరు. వారిని పక్కన పెడదాం. అభయ చైతన్య, పార్ధసారధి వంటివారు భాషా పటాటోపంలోనూ, హస్తముఖ అభినయంలోనూ తమ పూర్వీకులను మించి ప్రవచించ గలరు. అటువంటి మహానుభావులే కాక కొందరు స్త్రీలు కూడా ప్రవచనాలతో వారాలూ, నెలలూ ఉల్లాసం కలిగించగలరు. ఇటువంటి ప్రసంగాలు చెవికి ఇంపుగా ఉన్నా మెదడుకి పని చెప్పవని వాటి శ్రద్ధాళువులలో కొందరి అభిప్రాయం. ఇటువంటి సాముగరిడీల ముందు 2011 అక్టోబరులో నేను ఇచ్చిన తొంభై నిమిషాల ప్రసంగం సమగ్రతలో తేలిపోవచ్చు. చాలాకాలం క్రిందట, అప్పట్లో కలకత్తా నగరంలో 'మార్క్సిజం- ఇండాలజీ' అనే అంశంమీద జరిగిన మూడురోజుల సెమినార్లో ఇంగ్లీషులో గీత మీద ఒక పత్రం సమర్పించాను. దానిని చదివినప్పుడు, నన్ను దిగిపొమ్మని ఎవరూ అరవలేదు. నా.................

  • Title :Bhagavathgeetha Oka Avalokana
  • Author :Vivina Murty
  • Publisher :Vishalandra Publishing Housing
  • ISBN :MANIMN5031
  • Binding :Papar back
  • Published Date :Nov, 2023
  • Number Of Pages :192
  • Language :Telugu
  • Availability :instock