• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Bhageeratha Kona

Bhageeratha Kona By Renuk Vallepu

₹ 180

"చాల్లేమ్మే నీ ఏడుపు.. ఆపింక. మూడేళ్ల తర్వాత బిడ్డ దుబాయి నుండి వస్తే సంతోష పడక ఏడుస్తున్నావేందే పిచ్చిదానా?"

"అది గాడు పెద్దమ్మా! ఒక్కగానొక్క నలుసాయె. మా ఇంటాయన ఉన్నప్పుడు ఇంటర్ దాకా చదివిస్తిమి. ఇంకా పైచదువులు చదివిద్దామని అనుకొంటిమి. కానీ ఆయన కాలం చేసే. ఆయనే ఉంటే ఇలా బిడ్డని దేశం గాని దేశం పంపి, వాడు ఆణ్నుంచి పంపే సొమ్ముతో బతికేవాళ్ళమా పెద్దమ్మా.." అని ఏడుస్తోంది సుబ్బమ్మ.

"ఏమి చేద్దాంమే! ఆ దేవుడిట్లా మనల్ని నవ్విస్తూనే ఏడిపిస్తా ఉంటాడు. మన బతుకులు ఆ దేవుడు రాసిన రాతలే. ఎట్లా రాస్తే అట్లానే సాగుతాయి. బిడ్డ చూడు ఎట్లా చిక్కిపోయినాడో! ఉన్నన్ని రోజులు నచ్చినవి చేసిపెట్టు. ఉండి, తినిపోతాడు" అని సుబ్బమ్మని ఓదార్చి ముసలాయన పిలుస్తుంటే ఇంటిదారి పట్టింది పక్కింటి నూకాలమ్మ.

"మ్మా! నేను ఊర్లోకి వెళ్ళి, నా ఫ్రెండ్స్ని కలిసేసి వస్తా" అన్నాడు భాస్కర్. "ఇప్పుడే గదరా వొచ్చింది. కాసేపు ఇంటి పట్టున ఉండు..”

"బిరీన వస్తాలే మా..."

"చెప్పేది వినిపించుకోకుండా అట్లా పోతావేమి భాస్కరా?”.........................

  • Title :Bhageeratha Kona
  • Author :Renuk Vallepu
  • Publisher :Regi Acchulu
  • ISBN :MANIMN5961
  • Binding :Paerback
  • Published Date :Dec, 2024
  • Number Of Pages :162
  • Language :Telugu
  • Availability :instock