భైరవుడు
చాలా చాలా సంవత్సరాల క్రిందట జరిగిన కథ అని, ఒక క్షుద్ర మాంత్రికుడు - సుఖంగా సాగిపోతున్న సంసారాలను ఎలా నాశనం చేశాడో - కొన్ని దశాబ్దాల తరువాత, అతని కొడుకుచేతనే ఎలా హతమయ్యాడో అనే సంఘటనల్ని ఆసక్తికరంగా వివరిస్తూ - మా అమ్మమ్మ మాకు చెప్పిన కథ ఇప్పుడు మీకు చెబుతున్నాను.
ప్రతిరాత్రీ నిద్రపోయే ముందు మా కోరిక మేరకు ఎన్నో జానపద కథలు చెప్పేది. అందులో ఫ్రాన్స్ దేశపు జానపద కథలు, ఇటలీ దేశానికి సంబంధించిన కథల్ని మేళవించి చెబుతుండేది. అందుకే ఆమె చెప్పే కథల్లో ఫ్రాన్స్ పేర్లు, ఇంగ్లీషు పేర్లు దొర్లటివి. అందుకే ఆ పేర్లను పిల్లలందరం ఆసక్తిగా వినేవాళ్లం.
*****
గుంతకల్లు అనే పెద్ద నగరానికి దగ్గరగా ఎలగలవంక అనే పల్లె ఉంది. ఆ ప్రాంతమంతా ఎర్రటి నేలతో కూడుకున్నది. వర్షాధారంతోనే అక్కడి రైతులు పంటలు పండిస్తారు. జొన్న, మొక్క జొన్న, రాగి, చెనిక్కాయలు, కంది, పెసర, అనుములు మొదలగు పంటలు పండిస్తారు. కొందరు మోతుబరులు బావులు తవ్వించి కపిల బానల సహాయంతో నీరు బావుల నుండి పైకి తోడి కాలువల ద్వారా నీరుపారించి వరి, రాగి, గోధుమ వగైరా పంటలు పండిస్తారు.
ఆ ఊరిచుట్టూ కొండలు సహజసిద్ధమైన కోటగోడల్లా ఏర్పడి ఉన్నాయి. ఎత్తైన చెట్లు విస్తారంగా పెరిగి ఉన్నాయి. అవి పచ్చగా కళకళలాడుతుంటాయి. అక్కడ పూర్వకాలంనాటి రాజులు త్రవ్వించిన చెరువులు తప్ప ఇతర నీటిపారుదల కాలువలుగానీ, నదులు గానీ లేవు. వర్షాలు విరివిగా పడితేనే బావులు, చెరువులు కళకళలాడతాయి. ప్రజల అవసరాలు తీరుతాయి.
ఒక్కొక్కసారి వరుణుడు వరుసగా రెండుమూడేండ్లు ముఖం చాటేస్తాడు. దాంతో వర్షాలు కురవవు. అందువల్ల అక్కడి ప్రజలు కేవలం వర్షాధార పంటలనే..........................