జ్ఞాననిధి స్వామి పరమార్థానంద!
పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనమ్ |
ఇహ సంసారే బహు దుస్తారే, కృపయాం.. పారే పాహి మురారే॥ సంసారచక్రం అంటే పునరపి జననం, పునరపి మరణం. ఈ చక్రంనుంచి మనను రక్షించి మనకు మోక్షం ప్రసాదించగలిగేది శ్రోత్రియ బ్రహ్మనిష్టాపరుడైన గురువు ఒక్కరే! అటువంటి గురువు ఎక్కడ ఉన్నారు అని మనం వెతకనవసరంలేదు. ఆయన మన మధ్యలోనే, అవిరామంగా బోధలు చేస్తూ, ఎందరికో ఆత్మజ్ఞానం కలుగచేస్తూ ఉన్నారు. ఆయన వేరెవరోకాదు. సాక్షాత్తూ స్వామి పరమార్థానందగారు.
నాకు చిన్నప్పటినుంచి భగవద్గీత అంటే విపరీతమైన ప్రీతి. దాదాపుగా పదిమంది స్వామీజీల భగవద్గీత వ్యాఖ్యానాలు విన్నాను. అది ఉపనిషత్తుల సారం కాబట్టి చిన్మయామిషన్లో ఉపనిషత్తు బోధ జరిగినప్పుడల్లా అక్కడికి వెళ్ళి వింటూ ఉండే వాడిని. తరువాత బ్రహ్మసూత్రాలమీద మక్కువ ఏర్పడింది. దానికి ఒక పుస్తకం చదివాను కాని ఇంకా లోతుగా తెలుసుకోవాలనిపించి, నెట్లో సర్ఫ్ చేస్తూంటే పరమార్థానందవారి బోధ దొరికింది. అవి 390 తరగతులలో చెప్పిన ఆడియోలు. వాటిని డౌన్లోడ్ చేసుకుని వింటే - నా ఆనందానికి అవధులు లేవు.
వెంటనే రామకృష్ణా మిషన్కు పరుగు పెట్టాను, స్వామీజీని కలుసుకోడానికి. రామకృష్ణామిషన్ ను నిర్వహణ చేసే స్వామీజీ కూడా ఇదే ఆ పేరుతో ఉండేవారు. అక్కడ తెలిసింది, వీరు చెన్నైలో ఉంటారని. హుటాహుటిని చెన్నై బయలుదేరి స్వామీజీని కలిసి వారి శిష్యరికం కోరి, మైలాపూర్ లోని శాస్త్రప్రకాశికలో వారి ఆడియోలు కొని విందామని లోపలికి అడుగు పెట్టాను. నాకు కళ్ళు తిరిగినంత పనైంది. అనారోగ్యంతో కాదు ఆశ్చర్యంతో! అక్కడ.............