₹ 200
భారతీయ వాజ్మయంలో ప్రముఖస్థానాన్ని ఆక్రమించిన భక్తి సాహిత్యం. భరతఖండంలో ముఖ్యంగా ద్వైతద్వైతవిశిష్టద్వైతమతలు వ్యాప్తిలో ఉన్నాయి. ఒకప్పుడు మతాంతరాలవల్ల వైదిక మతానికి విఘాతం కలుగుతుంటే తన్నివారణార్ధం శంకరుడే శంకర భగవత్పాదులుగా అవతరించి, అన్యదుర్మాతలను ఖండించి అద్వైతమతాన్ని నెలకొల్పారని ప్రతీతి.
శ్రీ శంకర భగవత్పాదులు అద్వైతమత వ్యాప్తికై ఎంతో పాటుపడ్డారు.ప్రస్థాన త్రయమునకు భాష్యములు రచించారు. ఎంతో భక్తి వాఙ్మయాన్ని సృజించారు. శివకేశవా ద్వైతభావనతో ఎన్నో స్తోత్రాలు రచించారు. సర్వదేవతా సామరస్యాన్ని నెలకొల్పారు. ఇలా పరమ శివావతారులైన శ్రీ శంకర భగవత్పాదులు లోకానుగ్రహబుద్ధితో చెప్పిన ప్రకరణ గ్రంధాలూ అసంఖ్యాకంగా ఉన్నాయి. వాటిల్లో ఈ భజగోవిందం జగత్ర్పసిద్దమైనది .
- Title :Bhajagovindam Vyakhyanam
- Author :Dr Nandamuri Lakshmi Parvathi
- Publisher :Rushi Publications
- ISBN :MANIMN0990
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :208
- Language :Telugu
- Availability :instock