• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Bharat Charitra Adyayananiki Oka Parichayam

Bharat Charitra Adyayananiki Oka Parichayam By N Venugopal

₹ 250

మొదటి కూర్పుకు ముందుమాట

ఈ పుస్తకం భారతదేశ చరిత్ర పుస్తకంగా నటించడం లేదు. ఇది కేవలం భారత చరిత్ర అధ్యయనానికి ఒక ఆధునిక దృక్పథం మాత్రమే. పాఠకులను స్వయంగా చరిత్ర అధ్యయనానికి పురికొల్పాలనే ఉద్దేశంతో రాసినది మాత్రమే. లేదా దేశం గురించి ఆలోచించేటప్పుడు వారు మరింత ఎక్కువ సానుభూతి తోనూ అవగాహనతోనూ చూసే వీలు కల్పించడానికి మాత్రమే. ఈ లక్ష్యంతోనే, ఇక్కడ ఇచ్చిన ఉదాహరణలు విస్తారమైనవి కాక లోతైనవిగా ఉన్నాయి. అవి కూడ నా సొంత అనుభవం నుంచీ, అధ్యయనం నుంచీ తీసుకున్నందువల్ల పరిమితమైనవి మాత్రమే. అవి అత్యంత సాదా అయిన ఉదాహరణలు. నిజాయితీతో క్షేత్రపరిశోధన చేసేవారెవరికైనా దొరికే ఉదాహరణలు. కాకపోతే వాటిలో ప్రతి ఒక్కటీ ఏదో ఒక సాధారణ అంశాన్ని వివరిస్తుంది. తన చుట్టూ ఉన్న వారి జీవితాల నుంచీ, అలవాట్ల నుంచీ, తన ప్రత్యేక ప్రాంతంలోని ప్రాచీన అవశేషాల నుంచీ పాఠకుడికి మరింత మెరుగైన వివరణలు నిస్సందేహంగా దొరకవచ్చు. సామాన్య ప్రజానీకం దగ్గరికి వెళ్లడం సులభమైన పని కాదు. ఎన్నో తరాలుగా సాగుతూ వచ్చిన దారుణమైన పేదరికం, దోపిడీలు కల్పించిన మానసిక అవరోధాలను ఎండ, దుమ్ము, బురద, అశుభ్ర పరిసరాలు మరింత బలోపేతం చేస్తాయి. కాని, సరిగా చేసినట్టయితే, ఓపిక నశించిపోయినవారికీ, వయసుతో కీళ్లు బిగదీసుకుని బాధకలిగించేవారికీ కూడ ఈ పని గొప్ప ఆనందాన్ని కలిగించేలా ఉంటుంది. ఇటువంటి క్షేత్ర పరిశోధనను విమర్శనాత్మకమైన చూపుతో, దేన్నీ యథాలాపంగా అంగీకరించకుండా, విశ్వాసాన్ని బట్టి పోకుండా చేయవలసి ఉంటుంది. అయితే అతిశయ దృక్పథం, భావోద్వేగపరమైన సంస్కరణవాదం, కుహనా నాయకత్వం మనలో చాలమందిని ఇటువంటి విషయాలు నేర్చుకోకుండా ఆపుతాయి. మనమిక తప్పుడు పాఠ్యపుస్తకాల నుంచి తప్ప మరిదేని నుంచీ నేర్చుకోకుండా అవుతాం.

భారతదేశంలోని నర్మగర్భమైన, నిగూఢ తాత్విక దృక్పథాలు, కుటిలమైన మతాలు, అలంకారభరితమైన సాహిత్యం, అత్యంత సునిశిత శిల్పంతో నిండిన స్మృతి చిహ్నాలు, సున్నితమైన సంగీతం అన్నీ కూడ, గ్రామస్తుడి ఆకలిగొన్న నిర్లిప్తతనూ, 'సంస్కార' శ్రేణి అర్థరహిత అవకాశవాదాన్నీ, చీడపురుగువంటి దురాశను, సమన్వయం పొందని శ్రామికుల ఆగ్రహ అసంతృప్తినీ, సాధారణ నిస్సహాయతనూ, దారిద్ర్యాన్నీ, దౌర్భాగ్యాన్నీ, పతనానికి దారితీసిన మూఢనమ్మకాన్నీ సృష్టించిన ఒకే చారిత్రక క్రమం నుంచే తలెత్తాయి. అవి ఒకదాని ఫలితం మరొకటి. ఒకదాని వ్యక్తీకరణ మరొకటి. అత్యంత ఆదిమమైన సాధనాలు అతి స్వల్పమైన మిగులునే సృష్టించాయి. ఆ మిగులును తత్సంబంధిత ప్రాచీన సాంఘిక యంత్రాంగం కొల్లగొట్టింది. ఆ మిగులు అతి కొద్దిమందికి సాంస్కృతిక విశ్రాంతిని ఇచ్చి వాళ్లు అధోజగత్తులో................

  • Title :Bharat Charitra Adyayananiki Oka Parichayam
  • Author :N Venugopal
  • Publisher :National Translation Mission
  • ISBN :MANIMN3861
  • Binding :Papar back
  • Published Date :2014
  • Number Of Pages :488
  • Language :Telugu
  • Availability :instock