• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Bharat Charitra Parichaya Vyasalu

Bharat Charitra Parichaya Vyasalu By D D Koshambi

₹ 70

మొదటి నగరాలు

భారత భూమిలో రైతాంగ ఆవిర్భావం, పెరుగుదల గురించి ఇపుడు చాలా వివరాలు తెలుసు. గిరిజన జీవితం కొద్ది కొద్దిగా అదృశ్యమవుతూ వ్యావసాయిక సమాజానికి చోటు కల్పించింది. వ్యవసాయం వల్ల ఆహారం సులభంగా దొరకడం వంటి అంతర్గత కారణాలతో రైతాంగ అభివృద్ధి చెందింది. ఈ క్రమంలో ఏయే ప్రాంతాలు ఏయే కాలాల్లో అభివృద్ధి చెందాయనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానాలు దొరక్కపోయినా, అభివృద్ధి క్రమాన్ని రేఖామాత్రంగానైనా అర్ధం. చేసుకోగలుగు తున్నాం.

ఇది గ్రామీణ జీవితం సంగతి. మరి నగర జీవితం మాటేమిటి? అసలు, నాగరికత అంటే, నగర జీవితాన్ని కేంద్రం చేసుకుని అభివృద్ధి చెందిన సంస్కృతే కదా. భారతదేశంలో నగరాల గురించి తెలుసుకోకుండా, భారత, "నాగరికత"ను ఎలా అర్థం చేసుకోగలం? ఈనాటి భారతీయ నగరాలకు విదేశీ తరహా ఉత్పత్తి విధానమే మూలం. కాని, ఈ యంత్రయుగానికి ముందే, భూస్వామ్య యుగానికి పూర్వమే, భారతదేశంలో నగరాలు వర్థిల్లాయి. చరిత్ర పూర్వయుగాలనుంచి ఈ నగరాలు ఎలా అభివృద్ధి చెందాయనేది పరిశీలించాల్సిన విషయం. భారతదేశంలో నగరాలు క్రీస్తు పూర్వం మొదటి సహస్రాబ్దం వరకు లేవని మొన్నమొన్నటివరకు అనుకున్నాం. వాయువ్య దిశ నుంచి భారత దేశంలో ప్రవేశించిన ఆర్యులు అనే పశుపాలక సంచార జీవుల వారసులు వీటిని నిర్మించారని భావించాం. క్రీస్తు పూర్వం 1500 - 1000 కాలంలో ఇక్కడి ఆదిమ తెగలతో పోరాడుతూ, వారిలో వారే కలహిస్తూ జీవించిన ప్రజలనే ఆర్యులంటారు. ఆ తరువాత కాలంలో వీరే | గంగానది బేసిన్లో నగర జీవితాన్ని ప్రారంభించారు. ఈ అవగాహన ప్రకారం భారత భూమిలో మొదటి మహానగరం పాట్నాయే అవుతుంది. ప్రాచీన సంస్కృత గ్రంథాలు, మంత్రాలు, కథలూ గాధలే ఈ అవగాహనకు ఆధారం.

కాని, 1925 పురాతత్వ తవ్వకాలలో ఈ అభిప్రాయానికి కాలం చెల్లింది. అతి ప్రాచీన నగర జీవితానికి సంబంధించిన శిధిలాలు ఈ తవ్వకాలలో బయటపడ్డాయి. ప్రాచీన సాహిత్యంలో వీటి గురించిన ప్రస్తావన లేదు. ప్రధానంగా రెండు నగరాలకు సంబంధించిన అవశేషాలు పురాతత్వ శాస్త్రజ్ఞుల కంట పడ్డాయి. పూర్తి వికాసంలో ఉన్న రోజుల్లో ఒక్కో నగరం ఓ చదరపు మైలు వైశాల్యం ఆక్రమించింది. ఈ రెండు నగరాలూ సింధూనది బేసిన్లో క్రీ.పూ. మూడో సహస్రాబ్దిలో వెలిశాయి. దక్షిణాన సింధ్ రాష్ట్రంలో, సింధునదీ తీరంలో మొహెంజొదారో నేడు ఒక పెద్ద గుట్టలా కనిపిస్తుంది. ఉత్తరంగా పశ్చిమ పంజాబ్లో రావీ నది ఒడ్డున హరప్పా వెలసింది. అప్పటికీ, ఇప్పటికీ రావీనది ప్రవాహ మార్గం మారిపోయింది. చారిత్రకంగా, నదులు, ప్రవాహ మార్గాలు మార్చుకోడం అరుదైనదేమీ కాదు. ఇళ్ళను కాల్చిన ఇటుకలతో, పలు అంతస్తులతో భవంతులు కట్టారు. వీటికి స్నానశాలలు, మరుగుదొడ్ల వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. కుండలపై అలంకరణ పెద్దగా లేదు. కాని ఇవి, వేగంగా తిరిగే చక్రం మీద భారీ ఎత్తున తయారైన నాణ్యమైన కుండలు అనడంలో సందేహం లేదు. ఆనాటి బంగారం, వెండి, ఆభరణాలు, తదితర సంపదలకు కూడా ఆనవాళ్ళు దొరికాయి. పట్టణ ప్రణాళిక నేటికీ అద్భుతాశ్చర్యాలు కలిగిస్తుంది. 200 × 400 గజాల కొలతలతో చతురస్రాకార గృహ.........

  • Title :Bharat Charitra Parichaya Vyasalu
  • Author :D D Koshambi
  • Publisher :Hydrabad Book Trust
  • ISBN :MANIMN3801
  • Binding :papar back
  • Published Date :2017 5th print
  • Number Of Pages :144
  • Language :Telugu
  • Availability :instock