• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Bharata Praja Charitra 2, Sindu Nagarikata

Bharata Praja Charitra 2, Sindu Nagarikata By Irfan Habib

₹ 140

సింధునది పరివాహిక ప్రాంతం మరియు దాని సరిహద్దు ప్రాంతాలలో కాంస్య యుగం తొలి రోజులలో సంస్కృతి

1.1. పట్టణ విప్లవం వైపుగా

సుమారు 80 సంవత్సరాల క్రితం (1920 ప్రథమార్గంలో) సింధ్ ప్రాంతంలో మహంజోదారోను గుర్తించారు. తదనంతరం పంజాబ్ ప్రాంతంలో హరప్పా కనుగొన్నారు. ఈ రెండు భారతదేశపు మొదటి నగరాలు. అంతేకాదు, ప్రపంచంలోని మొదటి నగరాలలో ఇవి వనాయి. చరిత్ర పూర్వయుగంలో గుర్తించిన మానవ నివాసాలన్నీ గ్రామాలు. లేదా ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతం వెళుతూ మార్గమధ్యంలో ఏర్పాటవుతున్న తాత్కాలిక నివాసాలే. కొత్తగా ముందుకొచ్చిన పట్టణం లేదా నగరం మానవులు జీవించిన తీరులో పెను మార్పులకు కారణమైంది. ఈ మార్పును అర్థం చేసుకోవడం అవసరం.

గ్రామాన్ని, పట్టణాన్ని సాధారణంగా మనం పరిమాణం బట్టి తేడా చూస్తాం. పట్టణంలో జనాభా గ్రామంలో కన్నా ఎక్కువగా ఉంటారు. ఆ ప్రాంతంలో నివసించే ప్రజల వృత్తిని బట్టి కూడా మనం తేడాను గమనించవచ్చు. గ్రామంలో సాధారణంగా వ్యవసాయం, పశువుల పెంపకం వృత్తిగా వుంటాయి. వ్యవసాయం సంబంధితం కానటువంటి వృత్తులు పట్టణంలో ఉంటాయి. ఇవి పట్టణంలో నివసించే వారికి అందించే రకరకాల సేవలు. ఈ వివరణతోనే, పట్టణం గ్రామంకన్నా పరిమాణంలో పెద్దదని అర్థమవుతుంది. గ్రామం పెద్దదవుతుంటే, గ్రామం చుట్టూ

పోలాల విస్తీర్ణం కూడా విస్తరిస్తుంది. పొలాలకు చేరడానికి ప్రజలు చాలా దూరం వెళ్లాల్సి ంది. ఈ అసౌకర్యం ప్రజలను తమ పొలాలకు దగ్గరగా నివాసం ఏర్పరచుకునేందుకు చేస్తుంది. ఆ విధంగా నూతన గ్రామం ఏర్పడుతుంది. వ్యవసాయం, పశుపోషణలతో 'మం పరిమాణం ఒక స్థాయిని మించి పెరగదని దీనివల్ల అర్థమవుతుంది. పెద్ద

నివసించే ప్రాంతంలో వృత్తిదారులకు ఎటువంటి ఇబ్బంది వుండదు. వారు పనిచేసుకోగలరు. అంతేకాదు, ప్రజల సంఖ్య పెరిగే కొద్దీ వృత్తిదారులకు మరింత కలుగుతుంది. వారికి సరుకులు అమ్ముకోవడానికి మంచి మార్కెట్ అందుబాట

పంటం

కూడిన గ్రామం పరిమాణం - సంఖ్యలో ప్రజలు నివసించే ప్రాంతం ఇంటి నుండే పనిచేసుకోగలరు. ప్రయోజనం కలుగుతుంది. నా..................

  • Title :Bharata Praja Charitra 2, Sindu Nagarikata
  • Author :Irfan Habib
  • Publisher :Praja Shakthi Book House
  • ISBN :MANIMN3281
  • Binding :Papar Back
  • Published Date :May, 2022
  • Number Of Pages :111
  • Language :Telugu
  • Availability :instock