తొలి వైదిక దశ, క్రీ.పూ. 1500-1000
1.1 ఋగ్వేదం
ఋగ్వేదంతో మనం భారతదేశ చరిత్ర ప్రాంగణంలోకి ప్రవేశిస్తాం. ఒక్క ఋగ్వేదం
కాక వైదిక సాహిత్య సముచ్ఛయంలోని మిగిలిన భాగాలు మొత్తం సమకాలీన అరంలో అంత రూప వ్రాతప్రతులుగా లేవన్నది నిజమే అయినప్పటికీ, వాటిని జాగ్రత్త చేసిన పడతి కారణంగా ఈనాటికీ అవి తమ కాలపు స్థితిగతులను తెలియచెప్పే సముచిత ఆధారాలుగా సనాయి. వేద సారస్వతం ఆచార్యుల అధ్యయన, అధ్యాపనాలలో వాగ్రూపంగా నిలచి వున్నది. నీరే సాధ్యమైన మేరకు యీ సంపదను విశ్వసనీయమైన రీతిలో తమ ముందుతరాలకు అందచేశారు. ఆ రకంగా, వేర్వేరు ఋక్కులను ఒక చోటికి చేర్చి, వేర్వేరు సూక్తాలుగా క్రమపద్ధతిలో పెట్టటానికి ముందూ, తరువాతా కూడా ఈ వేదరాశి మౌఖిక రూపంలో ఒక తరాన్నుంచి మరొక తరానికి అందుతూనే వున్నది. వాగ్రూప పద్ధతికి ఆపాదించిన పవిత్రత బాగా సడలిన తరువాతనే ఈ పవిత్ర గ్రంథాలకు లిపి రూపం ఇవ్వటానికి ఆమోదం లభించింది. అల్బెరూనీ ప్రకారం క్రీ.శ. 10వ శతాబ్దం తరువాత మాత్రమే ఇలా జరిగినట్లు తెలుస్తున్నది. ఆనాటికి సైతం ఏ వేదపు వ్రాత ప్రతి కూడా వునికిలో లేదు. -
నాలుగు వేదాలలో ఋగ్వేదాన్ని మొదటిదిగా భావిస్తాం. ఋగ్ (ఋక్ యొక్క రూపం) అంటే స్తుతించు అని అర్థం, కాగా, సూక్తము, వేద (తెలుసుకొను అనే అర్థమిచ్చే విద్ నుండి వచ్చినది) అంటే జ్ఞానమని అర్థం. యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం అనేవి మిగిలిన మూడు వేదాలు. ఈ వేదాలలోని ప్రధాన భాగాలు సూక్తాలు, మంత్రాల వంటివాటితో కూడి వుంటాయి. వీటినే సంహితలు అంటారు. ప్రతి సంహితకు అనుబంధంగా బ్రాహ్మణాలు వుంటాయి. ఇవి ప్రధానంగా కర్మకాండ గురించి చెపాయి. తిరిగి ప్రతి బ్రాహ్మణం మరలా ఆరణ్యకాలు, ఉ పనిషత్తులతో కూడి వుంటుంది. ఆరణ్యకాల్లో ప్రధానంగా అరణ్యంలో వుండే వానప్రస్థుల కోసం గూఢ ధర్మ సూత్రాలు వుంటాయి. కాగా ఉపనిషత్తులు తాత్విక అంశాలతో కూడుకొని
వేరు
వుంటాయి.
వేద సముచ్చయంలోని అర్వాచీన భాగాల గురించిన చర్చ రెండవ అధ్యాయంలో వుంది.................