నాకు సరే, మన రాజ్యాంగానికి స్ట్రోక్ వద్దు
- రచయిత మాట
మా అమ్మ, తమ్ముడు, అక్కయ్య.... మేము, (హైదరాబాద్, చార్మినార్ సమీపాన) ఆ చంద్రాయణ గుట్టలో హాయిగా జీవితం సాగుతున్నది. తమ్ముడిని 'బాబు' అనిపిలిచేది, అమ్మ. ఉన్నట్టుండి మంచం దిగి, సంచి వేసుకుని ఇంటి బయటకు నడుస్తున్నది. అమ్మను, తమ్ముడిని అక్కను కలువడానికి వెళు తున్నానని అనుకుంటున్నది.
మనవరాలు అడిగింది.. "తాతమ్మ ఇంటి బయటకు నడుస్తున్నది. తాతమ్మ వెళ్లిపోతున్నది అక్కయ్యా" అంటూ వేగంగా వచ్చేసి మళ్లీ "తాతమ్మ ఎక్కడికి పోతున్నావే?”
తాతమ్మ చెప్పింది... “ఇంటికి వెళుతున్నానే. మా అమ్మ పిలుస్తున్నది. అక్కడ అక్క బాబు ఉన్నారు. మాట్లాడుకోవాలె." మనవరాలు అడిగింది. "హయ్యో ఎక్కడున్నావు నువ్వు. వెనుక నాటి రోజుల్లో లేవే. బాగానే ఉంది.". తాతమ్మ మళ్లీ అంది : "అదేం కాదు. మా అమ్మ పిలుస్తున్నది." మనవరాలితో మరోసారి చెప్పింది..
"హయ్యో.... తాతమ్మ మీ అమ్మ ఇప్పుడు లేనేలేదు. ఎప్పుడో పోయిందే..."
ఇంకా మాట పూర్తికాక ముందే మనవరాలును ఛళ్లున చెంపదెబ్బ కొట్టింది. చెంపవాచి పోయింది.
తాతమ్మ కోప్పడుతూ అడిగింది...
"ఏమే నా కన్నతల్లిని పోయిందంటావా”.
అమ్మను జాగ్రత్తగా మంచానికి చేర్చారు.
అమ్మకు.. ముగ్గురు సంతానం. మా అన్నయ్య, నేనూ (కేశవ్), చెల్లి, అమ్మ.. ఒక పెద్ద చెట్టు. 92 ఏళ్లున్న నీడిచ్చే వెచ్చదనం ఇచ్చే,.........