₹ 200
ఊహ తెలిసేటప్పటికీ అమ్మ, నాన్నల తర్వాత మా ఇంట్లో వినబడ్డ పేరు నేతాజీ సుభాష్ చెంద్ర బోస్. పాటల రూపంలో కూడా తరుచుగా వింటూ ఎవరైనా కమ్యూనిస్టు లీడర్ వచ్చినప్పుడు వాళ్ళవాళ్ళో కూర్చొని వచ్చిరాని మాటలతో పాడుతుండే దాన్నట. "ఢిల్లీ చలో" భారత నేత భాగ్యదాత బోసుబాబు పిలిచేరమ్ము . ఈ పాట అమ్మ నోట, నాన్న నోట మా ఇంటికి వచ్చే కమ్యూనిస్టు నాయకుల నోట వింటూ పెద్దయ్యాక బోసుబాబులాగా సైనిక దుస్తులు వేసుకోవాలని కలలు కనేదాన్ని. అప్పట్లో ఢిల్లీ ఎందుకు పోవాలో అర్ధం కాకపోయినా అక్కడికి పోతే తెల్లాళ్ళు పారిపోతారంట. బోసుబాబు పెద్ద కుర్చీలో కూర్చుని మన దేశాన్ని రాజులాగా ఏలుతాడంట అనే అమ్మ పాత మాటలు విని ఢిల్లీ ఎప్పుడు పోవాలా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. అలా బాల్యం నుండి గుండెలో, కండల్లో, ప్రతి రక్తనాళంలో బోసు పై అభిమానాన్ని, ఆవేశాన్ని నింపుకొని పెరిగాను. ఎక్కడ అయన బొమ్మ దొరికినా అపురూపంగా దాచుకునేదాన్ని.
- Title :Bharata Swatantra Samaramlo Netaji Subash Chandra Bose
- Author :Dr Nandamuri Lakshmi Parvathi
- Publisher :N.T.R. Educational Society
- ISBN :MANIMN1047
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :295
- Language :Telugu
- Availability :instock