పీఠిక
భారతదేశ చరిత్రను సబాల్టన్ స్టడీస్ దృక్పథంతో ఒక 5 భాగాలు వ్రాయాలని నిర్ణయించారు. ఇప్పటికి రెండు భాగాలు లోకాయత ప్రచురణల ద్వారా ప్రచురించారు. ఈ భారతదేశ చరిత్రను అంబేడ్కర్, ఫూలే ఆలోచనా విధానంతో రాయాలని తలపెట్టాను. ముఖ్యంగా ఈ రచనకు ప్రేరణ శక్తులు మహాత్మాఫూలే, అంబేడ్కర్. నిజానికి అంబేడ్కర్ నిజమైన చరిత్రకారుడు. భారతదేశంలో చరిత్రను పునర్నిర్మించడానికి ప్రయత్నించిన వారు మహాత్మాఫూలే, అంబేడ్కర్లే. కానీ చరిత్రకారులు వరుసలో వారిని చేర్చకపోవడం బ్రాహ్మణ చరిత్రకారుల మోసపూరిత వైఖరి. మహాత్మాఫూలే ఒక హేతువాదిగా చరిత్రను చూసాడు. చరిత్రలో విధ్వంసమైనవి ఏవి?, చరిత్రలో నిర్మాణం అయినవి ఏవి అని ఆయన పరిశీలించి నూత్న చరిత్రకు ఆయువులు పోశారు. "జ్యోతిరావు ఫూలే ఆధునిక యుగంలో మొదటిసారిగా బ్రాహ్మణులకు, బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా ఆలోచన చేసి గళం విప్పారు. వారి స్వభావంలో వున్న అనేక వనరులను స్వంతం చేసుకొని జాతి స్వాతంత్ర్యాన్ని దెబ్బతీస్తున్నారని వివరించారు. జ్యోతిరావు తల్లిదండ్రులు ఆయనకు 'జ్యోతి' అని పేరు పెట్టడంలో ఒక చైతన్యం ఉంది. చాలామంది తమ పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో వాళ్ళు బ్రతకరని నీచార్థం వచ్చే పేర్లు పెడుతుంటారు. కానీ వెలుగు అనే అర్థంలో పేరు పెట్టడంలో తల్లిదండ్రుల చైతన్యం కనిపిస్తుంది. బ్రాహ్మణులు ఎన్ని రంగాల్లో పడిపోయినా అక్షర పరంగా మాత్రం వాళ్ళు ఆధిపత్యాన్ని వదులుకోరు. (దళితుల చరిత్ర) బ్రాహ్మణాధిపత్యం అన్ని రంగాల్లో ఎలా ఆధిపత్యం వహించిందో మహాత్మాఫూలే తన 'గులాంగిరి' పీఠికలో ఇలా వ్రాశారు.
బ్రాహ్మణులు శూద్రుల్ని బానిసలుగా మార్చి దిగజార్చిన వ్యవస్థ కొద్ది సంవత్సరాల క్రితం వరకూ అమెరికాలో అమల్లో ఉన్న బానిసత్వ విధానానికి ఏమాత్రం తీసిపోదు. కఠినాతి కఠినమైన బ్రాహ్మణ ఆధిక్యతా దినాల్లో పీష్వాల.........