• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Bharatadesa Swatantra Samaramlo Andhrula Tyagalu

Bharatadesa Swatantra Samaramlo Andhrula Tyagalu By Acharya Kutati Venkata Reddy

₹ 150

కన్నెగంటి హనుమంతు


 

జననం

కన్నెగంటి హనుమంతు గుంటూరు |

జిల్లా పల్నాడు ప్రాంతంలోని దుర్గి మండలం, కోలగట్ల గ్రామంలో అచ్చమ్మ వెంకటయ్య దంపతులకు ద్వితీయ సంతానంగా 1890వ సం॥రంలో జన్మించారు.

పల్నాటి సీమలో అటవీ ప్రాంతంలో ఎండుకట్టెలు సేకరించి వాటిని అమ్ముకొని పొట్టపోసుకుని కొందరు నిరుపేదలు జీవితం గడిపేవారు.

అడవులలో దొరికే ఎండు కట్టెలు అమ్ముకోవడం, పశువులను అటవీప్రాంతంలో మేపుకొంటూ జీవితం గడిపే పద్ధతిపై బ్రిటీష్ పాలకులు పన్ను విధించారు. ఆ ఆంక్షలను ఏకగ్రీవంగా వ్యతిరేకించారు కన్నెగంటి. శక్తివంతమైన బ్రిటీష్ పాలనా వ్యవస్థపై తన ధిక్కార స్వరం వినిపించారు. "ఈ చెట్టు నువ్వు పెట్టావా? విత్తు నువ్వు నాటావా? నువ్వు నీరు పోశావా? మా జీవగడ్డపై నీకెక్కడ నుంచి వచ్చింది పెత్తనం?' అనే పిడుగు లాంటి ప్రశ్నలతో కన్నెగంటి గర్జించారు. బ్రిటీష్ నిరంకుశ పాలనలో భారతీయులు అనుభవిస్తున్న అవస్థలను, అవమానాలను చూసి రగలిపోయిన కన్నెగంటి హనుమంతు పోరుబాట పట్టారు. అనేకమంది యువకులు ఆయన వెంట నడిచారు. తెల్లదొరలపై దండయాత్రకు పూనుకొన్నారు. ఉడుకు రక్తం కలిగిన యువకులను కలుపుకొని ఒక దండుగా కదిలారు కన్నెగంటి హనుమంతు...............

  • Title :Bharatadesa Swatantra Samaramlo Andhrula Tyagalu
  • Author :Acharya Kutati Venkata Reddy
  • Publisher :Acharya Kutati Venkata Reddy
  • ISBN :MANIMN4814
  • Published Date :2023
  • Number Of Pages :231
  • Language :Telugu
  • Availability :instock