"గౌతమబుద్ధుడిని, కబీరిని, మహాత్మాఫూలేని ఆరాధిస్తాను...."
"I am a devotee of Gautam Buddha, Kabir and Mahatma Phule...... Vol. 17, Part III, pg. 504 - 505
1954వ సంవత్సరం అక్టోబర్ 28 సాయంత్రం ఆరున్నర గంటలకి బొంబాయి. నైగాంలోని పురందరె స్టేడియంలో డాక్టర్ అంబేడ్కర్ వత్రోత్సవ సమితి అధ్వర్యంలో ఒక మహాసభ జరిగింది. ఈ సభకు దాదాపు 25 వేలమంది హాజరయినారు. శ్రీ ఆర్.డి. భండారే అధ్యక్షత వహించారు.
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్కి 1952 ఏప్రిల్ 14వ తేదీకి అరవై సంవత్సరాలు నిండాయని, ఈ ఉత్సవం అప్పుడే జరిపి వుండవల్సింది కానీ, కొన్ని కారణాల వలన జరపలేకపోయి, యిప్పుడు జరుపుతున్నామని శ్రీ శంకర్ అనంత్ ఉపాశం అన్నారు. ఈ సందర్భంగా ప్రోగుచేసిన నిధికి జమా లెక్కలు చెప్పారు. ఇప్పటివరకూ నిధి కోసం 93,000/-ల రూపాయలు ప్రోగు చేశామనీ, ఖర్చులు పోను 88,000 వున్నాయనీ, ఈ సొమ్మంతా కూడా గ్రేటర్ బొంబాయిలోని తమ వర్గ ప్రజల నుంచే సేకరించామనీ చెప్పారు. బొంబాయి -బయటి ప్రాంతాల నుంచీ 32,000 సేకరించామనీ, అంతా కలిపి ఒక లక్ష పద్దెనిమిది వేల రూపాయలు డాక్టర్ అంబేడ్కర్కి బహూకరిస్తున్నామని చెప్పారు.
సభాధ్యక్షుడు తన ప్రసంగంలో, డాక్టర్ అంబేడ్కర్ వ్యాసునికన్నా, మనువుకున్నా, అబ్రహాం లింకన్ కన్నా, కార్ల్ మార్క్స్ కన్నా కూడా గొప్పవారని చెప్పారు. డాక్టర్ అంబేడ్కర్తో పోల్చదగిన నాయకుడెవరూ భారతదేశంలోనే లేరన్నారు. దేశవిభజనకి పది సంవత్సరాలముందే విభజనానంతర పరిస్థితులని ఊహించి అంబేడ్కర్ చెప్పారన్నారు. తన జీవిత సర్వస్వాన్నీ అణగారిన ప్రజల శ్రేయస్సు కోసం అంకితం చేశారని అన్నారు. డాక్టర్ అంబేడ్కర్కి నిధిని బహూకరిస్తూ, ఆ నిధిని ఆయన తన స్వంతానికి వాడుకోవాలని కోరారు. ఆయన కోరినట్లుగా భవన నిర్మాణం చేస్తామనీ, అందుకు వేరే నిధిని సేకరిస్తామనీ చెప్పారు.
డాక్టర్ అంబేడ్కర్ తనకి జరిగిన సత్కారానికి సమాధానం చెబుతూ - ఆ నిధిని భవన నిర్మాణానికే ఉపయోగిస్తానని చెప్పారు. ఈ భవనం నిర్మించటానికి అదివరకే స్థలం సేకరణ............