• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Bharateeya Charitra Shudra Drukpatham

Bharateeya Charitra Shudra Drukpatham By B S Ramulu

₹ 450

భారతీయ చరిత్రలో నూతన దృక్పథం

చికాగో నుండి స్వామి వివేకానంద భారతదేశ మిత్రునికి రాసిన లేఖలో ఇలా 4 అన్నారు. "ఉత్పత్తిలో పాల్గొని ఉత్పత్తి చేసే శూద్రులను బరువులు మోసే గాడిదలుగా, మానవజాతి విస్తరణార్థం బాధ్యతను వహించిన స్త్రీలను సంతానం కనే పశువులుగా" చిత్రీకరించడం భారతదేశ సంస్కృతికి ఉన్న రెండు గొప్ప చెడు గుణాలు".

దేశాభివృద్ధిలో శూద్ర, అతిశూద్రుల, స్త్రీల పాత్ర చాలా గొప్పది. వీళ్ళు లేకుండా, వీరి కృషి లేకుండా దేశాభివృద్ధి లేదు. అయితే వీరి గురించి చరిత్రలో ఎక్కడా ప్రస్తావన కనిపించదు. శూద్రులను, అతిశూద్రులను, స్త్రీలను అణచివేసిన 31 విజేతల చేతులతో చరిత్ర రచన చేశారు. అది అగ్రకులాల వారు రాసినది. కాబట్టి చరిత్ర రచనలో శూద్ర, అతిశూద్రుల గురించి వారు సృష్టించిన ఉత్పత్తుల గురించి, ఉత్పత్తికి దోహదపడిన శాస్త్ర, సాంకేతికాల గురించి ఎక్కడా ప్రస్తావించకుండా చరిత్ర రచన చేశారు.

శాస్త్రీయత అని గొంతు చించుకునే వామపక్ష మేధావులు, చరిత్రకారులు రచించిన భారతదేశ చరిత్రలో కూడా శూద్రుల ప్రాధాన్యత కనిపించదు. యస్.ఎ. డాంగే వ్రాసిన “ప్రిమిటివ్ కమ్యూనిజమ్ ఇన్ ఇండియా" అనే గ్రంథంలో ఆర్యుల రాకతో భారతదేశ చరిత్ర రాసాడు. ఆర్యుల రాకకు ముందు ప్రపంచానికే తలమానికమైన సింధూ నాగరికత ఒకటి ఉన్నదని రాయలేకపోయాడు. ఇ.యం.ఎస్. నంబూద్రిపాద్ తన ఆత్మకథ పేరు 'వేదభూమి' అని రాశాడు. బ్రాహ్మణ కమ్యూనిస్టులు బ్రాహ్మణిజాన్ని మార్క్సిజంగా మార్చి ఎలా చెబుతారో ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. మోసేవాడికి తెలుసు కావడి బరువు అనేది సామెత. వృత్తులు చేస్తూ సంపద సృష్టించే వృత్తి కులాల చరిత్ర, శూద్రుల చరిత్ర ఆయా వృత్తి కులాల నుండి వచ్చిన వారు రాస్తే సార్థకత ఉంటుంది. సుప్రసిద్ద సామాజిక తత్వవేత్త బి.ఎస్. రాములుగారు వృత్తి కులాల నుండి వచ్చినవారు...............

  • Title :Bharateeya Charitra Shudra Drukpatham
  • Author :B S Ramulu
  • Publisher :Vishala Sahitya Acadamy
  • ISBN :MANIMN5058
  • Binding :Papar back
  • Published Date :2023 3rd print
  • Number Of Pages :312
  • Language :Telugu
  • Availability :instock