• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Bharateeya Darshanam

Bharateeya Darshanam By Aaluri Bhujagarao

₹ 350

ప్రాచీన బ్రాహ్మణ దర్శనాలు

క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల నుండి 600 సంవత్సరాల వరకు

మానవుడు ఉద్భవించాక వేనవేల సంవత్సరాల తరువాత గానీ అతడి బుద్ధికి 'దర్శనం' (తాత్విక చింతన) అనేది తట్టలేదు. యూరప్లో లాగానే భారతదేశంలోనూ దాదాపు క్రీస్తుకు 600 సంవత్సరాల క్రితం దార్శనిక చింతన మొదలయింది. అయితే, క్రీస్తుకు పూర్వం 1500 నుండి 1000 సంవత్సరాల క్రితం వరకు రచింపబడిన వేదాలలో భవిష్యత్తులో రూపుదిద్దుకోబోతున్న దార్శనిక చింతన తాలూకు ఛాయలు కనిపించాయి.

ఆనాటి మానవుడు దాదాపుగా ప్రకృతి ననుసరించి జీవించేవాడు. ప్రకృతిమీద ఆధారపడి బతుకుతున్న అలనాటి మానవుడి అజ్ఞానమూ, భయమూ - దేవుడికీ, మతానికీ కారణమయ్యాయి! కాలాంతరంలో మానవుడిలో బుద్ధి వికాసం జరిగింది. వెనుక కల్పించుకున్న (సాధారణమైన దేవతాకల్పన, మతానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు వికసించిన అతడి బుద్ధిని సంతృప్తిపరచలేకపోయాయి. ఆ స్థితిలో మానవుడి బుర్ర నేలవిడిచి సాము చేయటం ప్రారంభించింది. ఇంక అతడు ఊహల లోకాల్లోకి రెక్కలు విచ్చుకుని ఎగరసాగాడు. దార్శనిక చింతన చేయసాగాడు. మానవజాతి మతం వరకూ చేరటానికే లక్షల సంవత్సరాల బహుదూరపు ప్రయాణం చేయవలసి వచ్చింది. దీన్నిబట్టి మానవుడికి ప్రకృతి ననుసరించి జీవించడం మాత్రమే కాదు, ప్రకృతి ననుసరించి ఆలోచించడం కూడా చాలా ఇష్టమని స్పష్టమౌతున్నది! మానవ సమాజం స్వార్థపూరితమైన కారణాల్ని పురస్కరించుకుని వర్గాలుగా విభజింపబడకపోతే మతానికీ, దార్శనిక చింతనకూ ఇంతటి సఫలత లభించి వుండేది కాదు. ప్రపంచం నిరంతరం పరివర్తన చెందుతోంది. తదనుగుణంగా సమాజమూ మారుతోంది. మారుతున్న పరిస్థితుల్లో వర్గ స్వార్థానికి ఘోర ప్రమాదం సంభవించే అవకాశాలున్నాయి. ఆ స్థితి నుండి తన్ను తాను................

  • Title :Bharateeya Darshanam
  • Author :Aaluri Bhujagarao
  • Publisher :Vishalandra Publishing Housing
  • ISBN :MANIMN6034
  • Binding :Paerback
  • Published Date :April, 2024
  • Number Of Pages :379
  • Language :Telugu
  • Availability :instock