• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Bharateeya Nagarikatha Samskruthi Vaarasatvam Set of 1 & 2 Parts

Bharateeya Nagarikatha Samskruthi Vaarasatvam Set of 1 & 2 Parts By Vedantham Lakshmi Prasad

₹ 1600

నామాట

సాత్విక్ ప్రచురణాలలో  15వ పుస్తకంగా వెలువడుతున్న ఈ రచన యొక్క ఉద్దేశం ముందుగా తెలపాలి. నేడు అక్షరాస్యత వృద్ధి అవుతున్నా, ఆధునిక విద్యా విధానంలోను, నూతన జీవన విధానంలో, పిన్నలు మొదలు పెద్దల వరకు మన భారతీయ సంస్కృతిని గురించి తెలుసుకోవటానికి గాని, అధ్యయనం చెయ్యటానికి గాని అవసరం, అవకాశం వుండటం లేదు. అంతేకాదు వాటిని గురించి ప్రసంగించేవారి ఎడల అసహనం, ఒకింత చులకన భావాల్ని ప్రదర్శించటం విద్యాధికులలో మనం గమనించవచ్చు. ప్రాంతీయ భాషల్లో మన సంస్కృతి, నాగరికతలను గురించిన రచనలు బహు అరుదనే చెప్పాలి. ఒకవేళ ఎక్కడన్నా. ఉన్నా అవి అసంపూర్ణంగా వుండటం జరుగుతోంది.

మనకు తెలిసినా, తెలియక పోయినా మనందరం చరిత్రలోనే జీవిస్తాం. గత చరిత్రతో సంబంధం కలవే నేటి పరిణామాలు, పరిస్థితులు. మనం ఏ సంస్కృతికి వారసులం అని తెలుసుకోవటం భారతీయులుగా మన కర్తవ్యం. మన ఆశలు, ఆశయాలు, జీవిత సాఫల్యం కొరకు మనం చేసే ప్రయత్నాలు అన్నింటికి గత కాలం మార్గదర్శిలాగ వుంటుంది. మన దేశ నాగరికత మూలాలను, సంక్షిప్తంగానైనా పాఠకులకు పరిచయం చెయ్యాలన్న ఉద్దేశమే ఈ రచనకు స్ఫూర్తి.

యువత వామపక్ష భావజాలం వైపు ఆకర్షితులవటం సహజం. ప్రస్తుత రచయిత కూడా యవ్వనంలో వామపక్ష భావాలతో ఆకర్షితుడయి, క్రియాశీలకార్మిక ఉద్యమాలలో పాల్గొని వ్యక్తిగత కష్టాలను, నష్టాలను లెక్కచేయలేదు. రాహుల్................

  • Title :Bharateeya Nagarikatha Samskruthi Vaarasatvam Set of 1 & 2 Parts
  • Author :Vedantham Lakshmi Prasad
  • Publisher :Satwic Book 15, Hyd
  • ISBN :MANIMN5252
  • Binding :Papar back
  • Published Date :2022
  • Number Of Pages :456
  • Language :Telugu
  • Availability :instock