ఆయుధంలేని రాజ్యం ఒక సన్యాసాశ్రమం
మనదేశమునకు పూర్వకాలమునుండియు రెండువిధముల ముప్పు ఏర్పడు తున్నది. దుష్టులు తమ ధర్మవ్యతిరేకమైన అకృత్యములను ధర్మముగా సమర్థించుకుని వాడు ఒకటైతే, కేవలము సజ్జనులైనవారు తమతమ ఆశయములను అవలంబించడంకోసము క్షమ, తితీక్ష వంటి ఉత్తమమానవ లక్షణములను ప్రాతిపదికగా తీసుకొని, దానిని దేశవిషయకమైన రాజకీయము లందు సిద్ధాంతీక రించి వ్యాఖ్యానించడం మరొక ముఖ్యకారణమని మన పూర్వచరిత్ర చెబుతున్నది. ఒక పవిత్రసిద్ధాంత రక్షణ దేశక్షేమంకంటే అధికమని, అదొక గొప్పనైతికవిలువగా చిత్రించి, తమనుతాము మహాత్ములమని భావించడము అసమంజసము. తనని హత్యచేయడానికి వచ్చినవాణ్ణికూడా క్షమించి వదిలిపెట్టడము, తనకి అపకారము చేసినవాణ్ణి ఆగ్రహించకుండా వదిలిపెట్టడము, ద్వేషరహితమైన మనస్సుతో దుష్టుణ్ణి, శత్రువునికూడా ఉపేక్షించడము - సర్వసంగపరిత్యాగియై, మోక్షమార్గాన్వేషియై, స్థితప్రజ్ఞుడైన ఉత్తమునికి స్వకీయమైన, వ్యక్తిగతమైన ధర్మములు. కేవలం భౌతికము, లౌకికము అయినటువంటి క్షేమము, సుఖశాంతులు సమాజంమొత్తానికి - అంటే దేశానికి ఆవశ్యకము. సమాజంమొత్తానికి వైరాగ్యము, తాత్త్విక విలువలు, మోక్షధ్యేయం ఇవన్నీ సామూహికంగా అన్వయించే ధర్మాలు కావు. వ్యక్తిగతంగా కూడా ఇవన్నీ అందరికీ వర్తించే ధర్మాలుకావు. తన ఇల్లు, కుటుంబసభ్యులు వీళ్ళని రక్షించుకోవడానికి ఎట్టి సామాన్యగృహస్థు అయినప్పటికీ ఆయుధాన్ని చేపట్టడం ధర్మమే అవుతుంది. తనను చంపినాసరే, ఆత్మరక్షణకొరకుకూడా శత్రువుని చంపకపోవడమనేది ప్రపంచవిముఖుడైన జ్ఞానికి, నిర్లిప్తునికి సంబంధించిన వ్యక్తిగత ధర్మము. అట్టిధర్మాన్ని బౌద్ధులు అవలంబించారు. టిబెట్ దేశంలో అనేకమంది శ్రమణులు, ప్రతిక్రియ దోషమని విశ్వసించి, తధాగతుని చేతనే తాము.............