భారత రాజ్యాంగ పీఠిక
భారత రాజ్యాంగం ఒక సామాజిక, రాజకీయ, న్యాయ పత్రం. ఇది ఒక సామాజిక విప్లవానికి (Social revolution) నాంది పలుకుతుంది. అందుకే రాజ్యాంగం ప్రజలందరికి ప్రీతిపాత్రమైనది. రాజ్యాంగంపై ఒక సమగ్ర అవగాహన విద్యార్థులందరికీ బాధ్యతాయుతమైన పౌరులుగా మారడానికి దోహదపడుతుంది. ఇది కేవలం చట్టపరమైన పత్రమే కాదు. ఇది మన చట్టాలన్నింటికీ మార్గదర్శక స్ఫూర్తినిస్తుంది. ఇది భారతదేశ ప్రజాస్వామ్య విలువలకి సజీవ నిదర్శనం. దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలతో, విధి, అవగాహన, భాగస్వామ్యాన్ని పెంపొందించే అత్యంత విలువైన పత్రమే - భారత రాజ్యాంగం.
భారత రాజ్యాంగం పీఠికకి పితామహుడు శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు. భారత రాజ్యాంగ పీఠిక, 'ఆబ్జెక్టివ్ రెసొల్యూషన్స్' అని పిలువబడే ముసాయిదా నుండి తీసుకోబడింది. ఈ ముసాయిదాను 1946 డిసెంబర్ 13న నెహ్రూగారు రచించి రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టగా అది 22 జనవరి 1947న తొలి దశలో అంగీకరించారు. అయితే, రాజ్యాంగసభ చివరి మీటింగ్లో 17 అక్టోబర్ 1949న రాజ్యాంగ ......................