ప్రథమ స్వతంత్ర సంగ్రామం - జ్యోతిబసు 1857లో జరిగిన మహా తిరుగుబాటు ఆధునిక భారత చరిత్రకు పరీవాహక ప్రాంతం లాంటిది. భారతదేశంలో ఆంగ్లేయులను మొట్ట మొదటి సారిగా సవాలు చేసినది... భారత జాతీయ రాజకీయాలు జీవం పోసుకోవడానికి స్ఫూర్తి రగిలించినది... దేశంలోని బ్రిటిష్ ప్రభుత్వం తన రాజ్యాంగంలో కీలక సవరణలు చేయాల్సి రావడానికి దోహదం చేసినది. ఈ రోజు... నూట యాభై సంవత్సరాల తర్వాత ఆ మహత్తర ఘటనను మనం గుర్తు చేసుకుంటున్నాం. జాతి నిర్మాణం పూర్తి చేయడానికి ఆ విప్లవం మనకు కొత్త స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంటుంది. పంతొమ్మిదవ శతాబ్దంలో అనేక సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలు చోటు చేసుకున్నాయి. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సినవాటిలో లాటిన్ అమెరికాలో సైమన్ బోలివార్ స్పానిష్ వలసవాదానికి వ్యతిరేకంగా జరిపిన పోరాటం, విప్లవ మత గురువు హిడాలో నాయకత్వాన జరిగిన పోరాటం. అయితే, సామాజికంగానూ భౌతికంగానూ అత్యంత శక్తివంతమైనది. 1857లో భారతదేశంలో జరిగిన తిరుగుబాటు, కొవ్వు పూత పూసిన తూటాలు ఉపయోగించడానికి వ్యతిరేకంగా ఈ సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. అయితే, భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ అమలు చేస్తున్న రాజకీయ వ్యవస్థ మూలంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలోని పౌర | సమాజపు విశాల సెక్షన్లతో సిపాయిలు భాగస్వాములయ్యారు. సిపాయిల తిరుగుబాటు, జనంలో వచ్చిన తిరుగుబాటు- రెండింటి కలయిక వల............... |