• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Bharatha Rajyangam Constitution of India

Bharatha Rajyangam Constitution of India By Dr B R Ambedkar

₹ 800

సమాంతర మాట

మన భారత రాజ్యాంగం దేశ సంస్కృతి, సాంప్రదాయాల మేలుకలయికగా ఉంటూ కొన్ని సందర్భాలలో దృఢంగా మరికొన్ని సందర్భాలలో సరళంగా ఉంటూ ఇంతవరకు 108 సవరణలు చేసుకుంది. ప్రపంచ రాజ్యాంగాలలో మేటి రాజ్యాంగంగా విశ్వవ్యాప్తంగా విమర్శకుల మన్ననలు | పొందింది. ఏ దేశ రాజ్యాంగం అయినా ఆ దేశ సార్వ భౌమాధికారాన్ని కలిగి ఉంటుంది. ప్రఖ్యాత రాజ్యాంగ నిపుణుడు ప్రొఫెసర్ గ్రీన్విల్లే ఆస్టిన్ "భారత రాజ్యాంగం సామాజిక విప్లవ లక్ష్యంతో తయారయిన మొట్టమొదటి సామాజిక పత్రం" అని అన్నారు. భారత రాజ్యాంగ నేపథ్యం ఎంతో చారిత్రకమైన గ్రంథం. ప్రతి భారతీయుడు ఆ విలువలు తప్పకుండా తెలుసుకోవాలి.

భారతదేశంలో 2 సెప్టెంబర్, 1946లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. జవహర్లాల్ నెహ్రూ తొలి ప్రధానమంత్రిగా ఉన్న క్యాబినెట్లో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ న్యాయశాఖ మంత్రిగా వున్నారు. భారత స్వాతంత్య్రానికి పూర్వమే గవర్నర్ జనరల్ గా లార్డ్ మౌంట్ బాటన్ వున్న సమయంలోనే మంత్రి మండలి ఏర్పడింది. భారత రాజ్యాంగం రూపొందించడానికి రాజ్యాంగ పరిషత్తు కూడా ఏర్పడింది.

రాజ్యాంగ పరిషత్తుకు సభ్యులను రాష్ట్రాల శాసన సభ్యులు ఎన్నుకుంటారు. అందులో రాజరికపు రాష్ట్రాలనుండి కూడా సభ్యులను ఎన్నుకున్నారు. డాక్టర్ అంబేడ్కర్ మొదటిసారి ఉమ్మడి బెంగాల్ నుండి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. 15 ఆగస్టు, 1947 న దేశానికి స్వాతంత్రం వచ్చింది. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఎన్నికైన ప్రాంతం తూర్పు పాకిస్తాన్లో కలిసిపోయింది. అందువల్ల రెండవ సారి బొంబాయి శాసనసభ నుండి డా॥ అంబేడ్కర్ ను రాజ్యాంగ పరిషత్కు ఎన్నుకోవడం వల్ల దేశానికి సేవ చేసే సువర్ణావకాశం లభించింది. 29 ఆగస్టు, 1947లో రాజ్యాంగ పరిషత్ ఏకగ్రీవంగా రాజ్యాంగ రచనా ముసాయిదా కమిటిని ఎన్నుకుంది. దాని అధ్యక్షులుగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ను ఎన్నుకున్నారు. మొత్తం రచనా కమిటీ సభ్యులు 1. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, (ఛైర్మన్), 2. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, 3. ఎన్. గోపాలస్వామి అయ్యంగార్, 4. డాక్టర్ కె.ఎమ్. మున్షి 5. సయ్యద్ మొహ్మద్ సామల్ల, 6. బి.ఎల్. విట్టర్, 7. డి.పి. కేన్లు ఎన్నికయ్యారు.

రాజ్యాంగ రచనా సంఘం రాజ్యాంగ ముసాయిదాను తయారు చేసి రాజ్యాంగ సభ అధ్యక్షులు డాక్టర్ రాజేంద్రప్రసాద్కు 21 ఫిబ్రవరి, 1948న అందజేశారు. ఈ ముసాయిదాలోని అంశాలను రాజ్యాంగ సభ ఒక్కొక్క షెడ్యూల్డు వారిగా క్షుణంగా అధ్యయనం చేసింది. రాజ్యాంగ సభ సభ్యులందరూ కలిసి వివిధ కమిటీలుగా ఏర్పడి 2 సంవత్సరాల 11 నెలలు, 18 రోజులు సుదీర్ఘ చర్చల అనంతరం నవంబర్ 19 నాడు రాజ్యాంగ సభ సంవిధాన ముసాయిదాను ఆమోదించింది...................

  • Title :Bharatha Rajyangam Constitution of India
  • Author :Dr B R Ambedkar
  • Publisher :Samanthara publications
  • ISBN :MANIMN6059
  • Binding :Hard Binding
  • Published Date :Jan, 2025 2nd print
  • Number Of Pages :639
  • Language :Telugu
  • Availability :instock