₹ 70
మన దేశంలోని కులయంత్రంగాన్ని, పుట్టుకను , వ్యాప్తిని శాస్త్రీయంగా వివరిస్తూ తమకు హిందువులు తమకుతామే కల్పించుకొని మూఢంగా శతాబ్దాల తరబడి ఆచరిస్తూ వస్తున్న అమానుష కులభావాన్ని సైద్ధాంతికంగా, సమూలంగా నిర్వీర్యం చేసి, విద్వంసం చేసిన అసాధారణ, విశిష్ట పరిశోధనా పత్రమిది. ఈ పత్ర పరిశోధనకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ సరిగ్గా శతాబ్దం క్రితం 1916 లో కొలంబియా విశ్వవిద్యాలయం లో ఆంత్రోపాలజీ సెమినార్ లో 25 ఏళ్ళ వయస్సులో చదివిన పత్రమిది.
భారతదేశంలో కుల భావన పరిశోధనకు సంబంధించి వూహల్లో విహరిస్తున్న అంతర్జాతీయ ఆంత్రోపాలజీ పరిశోధన రంగాన్ని పాశ్చాత్య/ భారతదేశ మేధోమనసాన్ని ఒక్క కుదుపు కుదిపి జుట్టుపట్టుకొని నెల మీదకి ఈడ్చుకొచ్చిన సంచలనాత్మక , పరిశోధనాత్మక, సైద్ధాంతిక పరిశోధనా పత్రమిది.
- Title :Bharathadesamlo Kulalu Vati Yantrangam- Puttuka- Abhivruddi
- Author :J Prabhakara Rao
- Publisher :Bhoomi Books Trust
- ISBN :MANIMN1262
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :64
- Language :Telugu
- Availability :instock