• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Bharatheeya Nasthikatvam

Bharatheeya Nasthikatvam By Dr Deviprasad Chattopadhyara

₹ 300

భారతీయ నాస్తికవాదం

 

భారతీయ నాస్తికవాదాన్ని అధ్యయనం చెయ్యడం ముఖ్యమైన పని. దానికి చాలా కారణాలున్నాయి. అందులో ఒకటి చాలా సరళమైంది. సుబోధకమైన కారణం కూడా. భారతీయనాస్తికత్వం గురించి తగినంత అవగాహన లేనప్పుడు సాంప్రదాయిక భారతీయ వివేకం గురించిన మన జ్ఞానం తప్పకుండా అసంపూర్తిగా మిగిలిపోతుంది. దానికి కారణం తెలుసుకోవడంకూడా అంత కష్టమేమీ కాదు. ఆ భారతీయవివేకానికి అగ్రగామి ప్రతినిధులయిన వాళ్ళలో స్పష్టమైన ఏకీభావం ఉన్న విశాలక్షేత్రం నాస్తికవాదం.

భారతీయ సాంప్రదాయిక వివేకానికి ప్రతినిధులు అన్నప్పుడు అన్నింటికన్నా ముఖ్యంగా అర్థంచేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రధాన భారతీయ తాత్విక దృక్పథాలను ప్రతిపాదించిన వాళ్ళు అని. నేను ఒత్తిచెప్పడానికి ప్రయత్నిస్తున్న సంగతి వాళ్ళలో అధిక సంఖ్యాకులు నాస్తికత్వానికి కట్టుబడిన వాళ్లు. అలా అనడం ద్వారా చెబుతున్నదేమిటంటే, వాళ్ళు భగవద్ భావన విషయంలో- ప్రాచీన గ్రీకు తత్వవేత్తలలో కొందరిలాగా ఊరికే ఉదాసీనంగా ఉన్నవాళ్ళు కాదు. అందుకు భిన్నంగా తమకు చేతనయినంత శ్రద్ధగానూ భగవత్ సమస్యను ఎదుర్కొన్న వాళ్ళు. ఎదుర్కొని, 'స్పష్టమైన తర్కాన్ని వదులుకోవడంద్వారా మాత్రమే భగవంతుడి ఉనికిని ఒప్పుకోగలం' అని వాళ్లు సతార్కికమైన నమ్మకానికి చేరుకున్నారు. అటువంటి సందర్భం ఇంకెక్కడా కనబడదు. ప్రపంచ తత్వశాస్త్ర చరిత్రలో దానికి సమాంతరంగా చెప్పుకోదగ్గ మరో సందర్భంలేదు.

ఈ ఉద్ఘాటనలు చాలామంది పాఠకులకు వింతగా, కల్పనలుగా సైతం, కనబడే..............

  • Title :Bharatheeya Nasthikatvam
  • Author :Dr Deviprasad Chattopadhyara
  • Publisher :Vishalandra Publishing Housing
  • ISBN :MANIMN5027
  • Binding :Papar back
  • Published Date :Jan, 2024
  • Number Of Pages :306
  • Language :Telugu
  • Availability :instock