• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Bharathiya Sahitya Nirmathalu Devulapalli Ramanujarao

Bharathiya Sahitya Nirmathalu Devulapalli Ramanujarao By J Chennayya

₹ 50

    డా.దేవులపల్లి రామానుజరావు (1917-1993) : తెలుగు భాషాభ్యున్నతికోసం అనేక విధాలుగా పాటుపడిన మహనీయులు. వరంగల్లు జిల్లా బొల్లికుంటలో 1917 లో జన్మించారు. నిజాం కళాశాలలో పట్టభద్రులయ్యారు. నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో కూడా పట్టభద్రులయ్యారు. మాడపాటి హనుమంతరావు వంటి పెద్దల నుంచి స్ఫూర్తి పొంది కవిగా, విమర్శకునిగా, పత్రికా సంపాదకునిగా, అనువాదకునిగా విశిష్ట సేవలందించారు. నిజాము పరిపాలనలో తెలుగు కొడిగట్టుతున్న దీపంలా మిణుకు మిణుకుమంటున్న దశలో 1943 లో ఏర్పాటైన నాటి ఆంధ్ర సారస్వత పరిషత్తు నేటి తెలంగాణ సారస్వత పరిషత్తులో 1944లోనే కార్యవర్గ సభ్యుడైన రామానుజరావు 50 సంవత్సరాల పాటు పరిషత్తే సర్వస్వంగా జీవించారు. పరిషత్తు వేదికగా యావత్ తెలుగునేల మీద తెలుగు వికాసం కోసం సేవలందించారు. 1957 లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఏర్పడిన నాటి నుంచి 1985లో అది రద్దయ్యేవరకు కార్యదర్శిగా, అధ్యక్షునిగా తెలుగు భాషా సాహిత్యాల అభ్యుదయం కోసం ఆవిరళ కృషి చేశారు. గ్రంథాలయ ఉద్యమం కోసం, ఉర్దూ తెలుగు భాషల మధ్య మైత్రీబంధం కొనసాగించడం కోసం పాటుపడ్డారు. రాజ్యసభ సభ్యులుగా కూడా వున్నారు. 'పచ్చతోరణం' పద్యకృతి, 'సారస్వత నవనీతం', 'వ్యాసమంజూష', ' యాభై సంవత్సరాల జ్ఞాపకాలు' వంటి గ్రంథాలు ప్రసిద్ధమైనవి.

              జె.చెన్నయ్య : 1958లో మహబూబ్ నగర్ జిల్లా కావేరమ్మపేటలో పేద కుటుంబంలో జన్మించిన డా. జె. చెన్నయ్య స్వయంకృషితో పైకి వచ్చారు. తెలుగు భాషా సాహిత్యాల్లో, జర్నలిజం, కమ్యూనికేషన్స్ లో స్నాతకోత్తర పట్టభద్రులు. అనువాద అధ్యయనంలో పి.జి.డిప్లొమా పూర్తి చేశారు. తెలుగు దినపత్రికల భాషా సాహిత్యాలపై పిహెడ్ పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. ఈనాడు దినపత్రికలో పాత్రికేయునిగా సేవలందించారు. తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రజా సంబంధాల అధికారిగా పని చేసి పదవీ విరమణ చేశారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శిగా సేవలు కొనసాగిస్తున్నారు. ఆకాశవాణిలో 30 ఏళ్ళుగా క్యాజువల్ న్యూస్ రీడర్ గా, అనువాదకునిగా సేవలందిస్తున్నారు. 'తెలుగు దినపత్రికలు భాషా సాహిత్యాలు', పత్రికలు ప్రసార మాధ్యమాలు-తెలుగు', 'వ్యాసమాలిక', 'కావూరి కుటుంబరావు ప్రస్థానం' వంటి మౌలిక గ్రంథాలు, 'స్వేచ్ఛకోసం - ఒక విహంగయాత్ర', 'సంధ్యారాగం', 'వజ్రపు ముక్కుపుడక', 'డేట్ లైన్ ఆంధ్ర', 'వీచిన ప్రాంతీయ పవనాలు' మొదలైన గ్రంథాలను ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించారు. 'స్వేచ్ఛకోసం-ఒక విహంగయాత్ర' కు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ అనువాద గ్రంథ పురస్కారం అందుకున్నారు. ఆకాశవాణి జాతీయ ప్రసారాల్లో రాష్ట్రపతులు ఆర్.వెంకట్రామన్, శంకరదయాళ్ శర్మ, కె.ఆర్.నారాయణన్, డా.ఎ.పి.జె. అబ్దుల్ కలాం, ప్రతిభాపాటిల్, రాంనాథ్ కోవించ్ ప్రసంగాలను తెలుగులోకి అనువదించారు.

  • Title :Bharathiya Sahitya Nirmathalu Devulapalli Ramanujarao
  • Author :J Chennayya
  • Publisher :Sahitya Akademy
  • ISBN :MANIMN2523
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :120
  • Language :Telugu
  • Availability :instock