• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Bharatiya Mathalu Desa Bhadrata Yedurkontunna Savallu

Bharatiya Mathalu Desa Bhadrata Yedurkontunna Savallu By Dr K Aravinda Rao

₹ 250

మూడు నాగరికతలు-మూడు కథలు

ఆధునిక యుగంలో నాగరికత (Civilization)ల మధ్య జరుగుతున్న సంఘర్షణలను అర్థం చేసుకోవడానికి ఈ నాగరికతలకు సంబంధించిన కథలు తోడ్పడతాయి. ఈ కథలు మూడూ మనకు బాగా తెలిసినవే.

మొదటి కథ పాశ్చాత్య నాగరికత (అమెరికా, యూరప్)కు సంబంధించినవి. పులి, మేక పిల్ల కథ. ఒక కాలువ వద్ద నీళ్ళు తాగేందుకు ఈ రెండూ కలవడం తటస్థపడింది. ప్రవాహానికి ఎగువవైపు పులి తాగుతుంది. దిగువవైపు మేక పిల్ల తాగుతుంది. మేక పిల్లను చంపాలనే కోరిక పులికి కలిగింది. ఊరకే చంపితే హింస అంటారు. చంపడానికి ఏదో లాజిక్ కావాలి. ఆ లాజిక్ ను ఉపయోగించి మేక పిల్లను చంపుతుంది. మేక పిల్ల వాదన అరణ్యరోదనమే.

ఒకానొక సమాజంలో ఉన్న కథలు ఆ నాగరికత యొక్క అంతరంగాన్ని తెలుపుతాయని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతారు. ప్రస్తుత పాశ్చాత్య ప్రపంచం యొక్క అంతరంగాన్ని పులి, మేక పిల్ల కథ తెలుపుతుంది. పాశ్చాత్య విశ్వవిద్యాలయాలు, ప్రొఫెసర్లు, మేధావులు తాము లక్ష్యం చేసుకున్న దేశాన్ని ఆర్థికంగా బలహీనపరచడానికి, సమాజంలో చీలికలు తేవడానికి, వాటిని తన గులాములుగా మార్చడానికి అనేక అధ్యయనాల్ని (Studies) చేస్తారు. కథలో పులి లాగానే వాళ్లు ఒక లాజిక్ తయారు చేస్తారు. ఫలానా దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన, లేదా మైనారిటీల, నిమ్నజాతుల అణచివేత జరుగుతుందని లేదా మతస్వేచ్ఛ లేదని, లేదా ఆ ప్రభుత్వానికి నియంతృత్వ పోకడలు ఉన్నాయని ఆరోపిస్తారు. పాశ్చాత్య ఇంటెలిజెన్స్ విభాగాలు అనేక తప్పుడు రిపోర్టులను తయారు చేస్తాయి. ఇలాంటి కారణాలతో వారు ఇతర దేశాల అంతరంగ విషయాలలో జోక్యం చేసుకుని, వీలైతే ప్రభుత్వాల్ని పడగొడతారు. పేద దేశాల వాదం వినేవాళ్లు ఉండరు. ఐక్యరాజ్యసమితి మూగ సాక్షిగా ఉంటుంది.....................

  • Title :Bharatiya Mathalu Desa Bhadrata Yedurkontunna Savallu
  • Author :Dr K Aravinda Rao
  • Publisher :Emesco Books pvt.L.td.
  • ISBN :MANIMN5691
  • Binding :Papar Back
  • Published Date :Sep, 2024
  • Number Of Pages :208
  • Language :Telugu
  • Availability :instock