భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, 2023
(BHARATIYA NAGARIK SURAKSHA SANHITA, 2023)
భారతదేశములో జరుగు నేరములకు, నేరములకు విధింపతగు శిక్షలను నిర్వచించి, వివరిస్తుంది 'భారతీయ న్యాయ సంహిత' (Bharatiya Nyaya Sanhita). భారతదేశములో జరుగు లేక భారతదేశములో విచారింపతగిన నేరములకు సంబంధించిన విచారణా ప్రక్రియ, భారతదేశ న్యాయ వ్యవస్థ, దానికి అనుబంధమగు ఇతర అంశములను 'భారతీయ నాగరిక్ సురక్షా సంహిత' (Bharatiya Nagarik Suraksha Sanhita) వివరిస్తుంది. ఈ సంహిత అమలులోకి రాక పూర్వము, ఇందుకు సంబంధించి బ్రిటీష్ వలస పాలకుల కాలములో 1898లో రూపొందించబడిన 'నేర విచారణ ప్రక్రియా స్మృతి' (Code of Criminal Procedure) అమలులో ఉండేది. (ఆ చట్టము 1973లో కొంత వరకు ప్రక్షాళన చేయబడింది). ఇప్పటివరకు అదే చట్టము అమలులో ఉన్నది (అప్పుడప్పుడు చేయబడ్డ కొన్ని మార్పులు, చేర్పులతో). అదే సమయములో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, తమకు అనుగుణముగా ఆ చట్టాన్ని అక్కడక్కడ సవరించుకున్నాయి. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణముగా నేరవిచారణ ప్రక్రియకు సంబంధించిన ఆ చట్టమును పూర్తిగా ప్రక్షాళన చేసి, దాని స్థానములో మరింత ఆచరణాత్మకమైన చట్టమును రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఆ క్రమములోనే పాత చట్టము స్థానములో ఈ క్రొత్త చట్టమును 'భారతీయ నాగరిక్ సురక్షా సంహిత' పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.
కానీ వాస్తవంలో పౌరహక్కులను, మానవ హక్కులను హరించే విధంగా, నక్సలైట్లు తదితర కమ్యునిస్టు గ్రూపులచే నిర్వహించబడుతున్న ప్రజా ఉద్యమాలను అణచివేసే విధంగా, వామపక్ష మేధావుల గొంతు నొక్కేవిధంగా, మరింత దుర్మార్గమైన అప్రజాస్వామిక నిబంధనలతో ఈ క్రొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. అనేక తర్జన భర్జనల అనంతరం ఈ క్రొత్త చట్టమునకు పార్లమెంటులోని ఉభయ సభలు ఆమోదం తెలుపటంతో,...............