Bharatiya Sahitya Nirmathalu Sankarambadi Sundarachari By V R Rasani
₹ 50
ఒకప్పటి మన రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిచేత, అప్పటి ప్రధాని నెహ్రూగారిచేత ప్రశంసలందుకున్న మహాకవి శంకరంబాడి. .
వీరు కావ్యాలు, గేయాలు, శతకాలు, వ్యాసాలు, కథ, బుర్రకథ, పల్లె పదాలు, కాలమ్ రచన, నాటకం వంటి పలు సాహిత్య ప్రక్రియల్లో రచనలు సాగించి నాటకాల్లో, సినిమాల్లో వేషాలు వేసి బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్నారు. కానీ అతనికి రాష్ట్ర గీతం రచయితగానే పేరుందిగానీ ఇన్ని ప్రక్రియల్లో రచనలు చేసిన కవిగా మాత్రం పేరు లేదు. అయినా మన రాష్ట్రగీతం అందరికీ తెలుసుగానీ, దాన్ని రాసిన రచయిత శంకరంబాడి అని చాలామందికి తెలియదు. మన దేశపు త్రివర్ణ జండాను రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య పేరు, 'నేను భారతీయుణ్ణి, భారతీయులందరూ నా సహోదరులు' అనే ప్రతిజ్ఞ (National Pledge)ను రాసిన పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరు తెలిసిన తెలుగువాడు అరుదే. 1975లో ప్రభుత్వం మన రాష్ట్ర గీతంగా గుర్తించడం వల్ల 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ' గీతం ప్రచారంలోకి వచ్చి సుందరాచారి పేరు చాలామందికి తెలిసింది.
- డా|| వి.ఆర్. రాసాని
కథ, నవల, నాటక రచయితగా, కవిగా, కాలమిస్టుగా, నటుడిగా, నాటక ప్రయోక్తగా, సాహిత్య విమర్శకుడిగా తెలుగులో సుప్రసిద్ధులు డా||వి.ఆర్. రాసాని. వీరు 150 పైగా కథలు, పాతికదాకా రూపకాలు, పది నవలలు, ఎనిమిది కథల సంపుటాలు మరికొన్ని పరిశోధక గ్రంథాలు, సంపాదక గ్రంథాలు వెలువరించారు. వీరి మెరవణి, పయనం, ముల్లుగర్ర, విషప్పురుగు లాంటి కథల సంపుటాలు, ముద్ర నవల, వలస, పరస, బతుకాట, వక్రగీత, స్వప్నజీవి లాంటి నవలలు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, కాటమరాజు యుద్ధము, చెంచిత, అజ్ఞాతం వంటి నాటకాలు, మనిషి పారిపోయాడు, జలజూదం, నేలతీపి, దృష్టి వంటి నాటికలు చాలా ప్రసిద్ధమైనవి. వీరి రచనలు కొన్ని కన్నడ, తమిళ, ఆంగ్ల, హిందీ, ఉర్దూ భాషల్లోకి అనువాదమయ్యా యి. వీరి రచనలు ఆంధ్రప్రదేశ్ లోని డిగ్రీ, పీజీ స్థాయిల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. వీరి రచనలపైన పలు విశ్వవిద్యాలయాల్లో దాదాపు ఇరవైమంది దాకా పరిశోధనలు సాగించారు. వీరు గరుడ, సినిమా, నంది నాటక పోటీలలో పలుమార్లు న్యాయనిర్ణేతగా ఉండి పలు అవార్డులు, రివార్డులు పొందారు
- Title :Bharatiya Sahitya Nirmathalu Sankarambadi Sundarachari
- Author :V R Rasani
- Publisher :Sahitya Akademy
- ISBN :MANIMN2528
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :156
- Language :Telugu
- Availability :instock