• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Bhavani Bhattacharya

Bhavani Bhattacharya By Shantinath K Desai

₹ 100

జీవిత0

10 నవంబర్ 1906లో బిహార్లోని భగల్పూర్లో భవానీ భట్టాచార్య జన్మించారు. అతని తండ్రి ప్రమోద్ భట్టాచార్య ఒక విశిష్టమైన బెంగాలీ ప్రభుత్వోద్యోగి. న్యాయమూర్తి పదవి నలంకరించే వరకు అధికారపు మెట్లు ఎక్కుతూనే వున్నారు. బాల్యంలోని భవాని నిరంతరం తండ్రి బుక్ షెల్ఫ్ లావుపాటి లా పుస్తకాలతో పాటు ఆ రోజుల్లో ప్రతి నాగరిక బెంగాలీ కుటుంబం డ్రాయింగ్ రూమ్లో అలంకారంగా

వుండే బెంగాలీ, ఆంగ్ల సాహిత్య రచనలతో సుపరిచితులు. పూరీలో గడిచిన అతని చిన్నతనం అతనిలో సముద్రంపట్ల గాఢమైన ప్రేమ నింపింది. అదే తరువాత జీవితంలో అతన్ని సుదీర్ఘ ప్రయాణీకుడిగా ప్రపంచమంతా నడిపించింది.

స్కూల్ విద్యార్థిగానే అతను బెంగాలీలో కవితలు చిన్న గల్పికలు రాయడం ఆరంభించాడు. వాటిలో కొన్ని అప్పటి విఖ్యాతినొందిన పిల్లల పత్రిక, “మౌచక్”లో చోటు చేసుకున్నాయి. దానికే రవీంధ్రనాత్ ఠాగూర్ కూడా తన రచనలనందించే వారు. అతను మెట్రిక్యులేషన్ పాసయే సమయానికి చాలా మటుకు ఆధునిక బెంగాలీ సాహిత్యాన్ని అతను అధ్యయనం చెయ్యడంతో పాటు షేక్స్పియర్ నాటికలు ఆంగ్ల సాహిత్యంలోని ముఖ్యమైన కావ్యాలనూ చదివాడు. 1923లో భవాని పాట్నా యూనివర్సిటీలో చేరి, సైన్స్ నుంచి ఆర్స్కు మారి, బి.ఏ. ఆనర్స్ కోసం ఆంగ్ల సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు. సాహిత్య విద్యార్థిగా అతను ఆంగ్ల, అమెరికన్ సాహిత్యాలను కూలంకషంగా చదవడంతో పాటు ముఖ్యంగా బర్నార్డ్ షా, ఇబ్సెన్, వాల్ట్ విట్ మాన్, జాన్ స్టేయిన్ బెక్, సింక్లైర్ లెవిస్, అఫ్ఘన్ లెవిస్, అలన్ ప్యాటన్ రొమేన్ రోలండ్ మొదలైన వారిపట్ల ఆకర్షితుడయ్యాడు. కాలేజీ బి.ఏ. విద్యార్థిగానే వరుసగా ప్రపంచ సాహిత్యం గురించి ఎన్నో వ్యాసాలను ఠాగూర్ సహకరిస్తున్న విచిత్ర అనే బెంగాలీ పత్రికకు రాశాడు. ఆ పత్రికలో ప్రచురింపబడ్డ అతని కవితలు కొన్ని ఆ గొప్ప కవి కళ్ళల్లో పడి ఆయన భవానిని ప్రోత్సహిస్తూ లేఖ రాశారు. ఇది ఠాగూర్ అతని సుదీర్ఘ విజయవంతమైన సాహచర్యానికి ఆరంభం. అతను ఠాగూర్ కవితలను కొన్నింటిని ఆంగ్లంలోకి అనువదించి తన కాలేజ్ పత్రికలో ప్రచురించాడు. ఒక పోటీ ద్వారా 'సంచయని' అనే ఠాగూర్ కవితా సంపుటికి కవితల ఎంపికకు ఎంచుకో బడ్డాడు.............

  • Title :Bhavani Bhattacharya
  • Author :Shantinath K Desai
  • Publisher :Sahitya Acadamy
  • ISBN :MANIMN5728
  • Binding :Papar Back
  • Published Date :2019
  • Number Of Pages :88
  • Language :Telugu
  • Availability :instock