ఉపోద్ఘాతము భావార్థ రత్నాకరమను గ్రంథమును శ్రీ భాష్యం రామాను చార్యులు అను ఉత్తమ జ్యోతిశ్శాస్త్రజ్ఞుడు రచించెను. ఈ గ్రంథమును తెలుగులో సులభముగ బోధపడునట్లు ఉదాహరణ జాతకములతోను విశేష వివరణలతోను పరాశర మతానుసారము అనేకానేకాంశములను వివరిం చుచు అనువదించడమైనది. పాఠకమహాశయుల ఆదరాభిమానముల వలన అయిదవ ముద్రణమునకు వచ్చినది. ఈ గ్రంథమును బాగుగ విమర్శనా దృష్టితో చదువుకునే వారికి జాతక ఫల నిర్ణయమును, దశల యొక్క
యోగా వయోగములను నిర్ణయించుట మిక్కిలి సులభముగ నుండునని మనవి చేయుచుంటిని. ఈ గ్రంథమునందు గల విషయముల కనుకూలము లైన అంశములను గ్రంధాంతరముల నుండి సందర్భానుసారముగ చేర్చడమైనది. విద్యార్థులకు పండితు లకుకూడ మిక్కిలి సహకరించు గ్రంథము. దైవవశముచేత, మనుష్య సహజములైన పొరపాట్లున్నచో వానిని సహృదయులు తెలిపినచో సరి చేసుకుందునని మనవి చేయుచుంటిని. గ్రంథమును సాధ్య మైనంతవరకు తప్పులు లేకుండ డి.టి.పి. చేసి యిచ్చిన శ్రీ వారణాసి సుబ్రహ్మణ్యంగారికి సుందరముగ సకాలములో ముద్రించి యిచ్చిన శ్రీమోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారికి నా కృతజ్ఞతలను తెలుపు కొనుచుంటిని.
ఇట్లు బుధజన విధేయుడు
- మధుర కృష్ణమూర్తి శాస్త్రి