సుబ్రహ్మణ్య అవతారం
- ప్రాచార్య ధూళిపాళ మహాదేవమణి
స్వామిది మహావిద్యా స్వరూపం. బ్రహ్మవిద్యను సుస్వరంగా ఎప్పుడూ రక్షించే అవతారం. ఏ విద్య లేకపోతే ఈ విశ్వమే లేదో... అదే ఈ మహాసర్పావతారం.
రామాయణంలో సముద్రం దాటడానికి లంఘించిన హనుమ స్వరూపం... ఒక మహావిద్యగా దర్శన మిస్తోందన్నారు మహర్షి. పడగ ఎత్తిన పాములా విజృంభించిన హనుమ తోక ఒక మహాసర్పంలా ఉంది. మహాశక్తి ఆ తోక అయితే, మహాదేవుడే ఆ హనుమ.
శివపార్వతులే ఈ విశ్వంలో మహావిద్య ప్రబోధకులు. సర్వ ఆగమాలూ ఆ మహావిద్యా మిధునాల ప్రసవాలే. ఆ ఆదిదంపతుల నుండి వచ్చినవే అన్ని విద్యలూ. సుబ్రహ్మణ్యావతారానికీ అందుకే ఆ జగత్పితరులు కారకులయ్యారు.
ఒకసారి కైలాసంలో ఒక మహా సమావేశం జరిగింది. అది ఎవ్వరూ ఏర్పాటు చేసింది కాదు. ఎవ్వరూ ప్రచారం చేసిందీ కాదు. ఎవ్వరికీ సమావేశ వార్తలు తెలియవు. వారంతవారే మహాశివ దర్శనానికి వచ్చారు. సకల దేవగణము, బ్రహోపేంద్ర మహేంద్రులూ అంతా సభక్తింగా శంభు సన్నిధికి వచ్చారు. దేవర్షులూ, బ్రహ్మర్షులూ అందరూ... వారివారి తపఃస్థాయిని బట్టి అందరూ విచ్చేశారు. వారందరికీ మహాదేవుడు అద్భుతమైన దర్శనాన్ని ప్రసాదించాడు.
కైలాసాగ మహాపీఠే శ్రీవిద్యా వ్యాఘ్ర చర్మణి
వేదాంత ఫలసంయుక్తా ప్రణవ శ్రుతియోగినౌ
ప్రకాశేతే కుమారాభ్యాం చంద్ర చూ శివంకరౌ
శివానంద ప్రదాతారౌ లోకానుగ్రహహేతవే
ఆ కైలాస పర్వతమే యావత్ బ్రహ్మాండానికీ సర్వవిద్యలకూ నిలయమైన
నేతి సూర్యనారాయణశర్మ