మొదటి మలుపు
చాలా కాలం క్రితం భూమి పుట్టింది. అప్పుడు మానవులు కలిసి మెలసి హాయిగా బ్రతికేవారు. భూమాత ప్రవహించే నదిని సృష్టించింది. అందమైన పచ్చటి పొలాలను తీర్చిదిద్దింది. మనుష్యులు త్రాగటానికి సరిపడే నీరు కిది చాలు. తినడానికి పంటలు పండించడానికిది కట్టుకోడానికి బట్టలు నేసే ప్రత్తి పండించటానికి చాలు. మనుష్యులు తృప్తిగా ఆనందంగా జీవించడానికి చాలు.
అలా ఏళ్ళు గడిచాయి. దశాబ్దాలు దాటాయి.
ఒక రోజు భూమాత మనుష్యులు భూమిమీద మంచిజీవితం జీవిస్తున్నారా అని ఆలోచనలో పడింది. తను నిజరూపంలో వెళ్ళి చూస్తే మనుష్యులు చుట్టుముడతారు. ఇంకా ఏదో కావాలని కోరతారని ఆమెకు తెలుసు. అలా ప్రతిఒక్కరి కోరికలను తీర్చడం కష్టమవుతుంది - దాదాపు అసాధ్యం. అందుచేత పది సంవత్సరాలు పాపగా మారు వేషం ధరించి భూమి మీదకు వచ్చింది...............