ఉపోద్ఘాతం
నేడు విప్లవాత్మక మార్పుకు హింస అవసరమా?
- అజయ్ గుడవర్తి
ప్రపంచంలోని పలు దేశాలలో రాజకీయ సమీకరణలు చాలా మార్పులకు లోనవుతున్నాయి. ఈ మార్పులు జరుగుతున్న సందర్భంలో ఒక ముఖ్యమయిన ప్రశ్న మళ్ళీ మళ్ళీ పునరావృతమవుతున్నది. అది రాజకీయాలలో హింస గురించి, మరీ ముఖ్యంగా విప్లవ హింస గురించి; సామాజిక , రాజకీయ మార్పులను సాధించడంలో దాని సామర్థ్యం గురించి. సున్నితమయిన ప్రజాస్వామ్య వ్యక్తీకరణలు పూర్తి భాగస్వామ్యం తో విస్తరిస్తున్న వేళ, అభిప్రాయాలలో విభేదాలు విస్తృతమవుతూ భిన్న అభిప్రాయాలకు తావుండాలన్న స్పృహ పెరుగుతున్న వేళ, ఒకే ఆసక్తులు కలిగిన మనుషుల సమూహాలు సూక్ష్మ స్థాయిలో గుంపులుగా ఏర్పడుతున్న సందర్భంలో, ప్రాతినిధ్యానికి సంబంధించిన సంక్లిష్టతలు సంస్థాగత అధికార |
క్రమానికి సంబంధించిన సమస్యలుగా, అనుచరుల పై నాయకులు సాగిస్తున్నప్రాబల్యంగా వ్యక్తీకరింప బడుతున్న సందర్భంలో, ఏ ప్రాంతానికి ఆప్రాంతం | సమీకరణల పై, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం నిర్మించిన ఉద్యమాలు ఆయా సంఘాలలో పనిచేస్తున్న వారి తక్షణ అవసరాల కోసమా అని సంశయాలు వ్యక్తమవుతున్న సందర్భంలో సామాజిక , రాజకీయ మార్పు కోసం చేసే హింసాప్రయోగం న్యాయబద్ధమయినదా, అది సమర్థవంతంగా ఉపయోగపడుతుందా అన్న విషయం చాలా ప్రశ్నలకు లోనవుతున్నది. ఈ విధమయిన ఆలోచనలను వ్యక్తపరుస్తూ మువలపు (Michel Toucault ఫ్రెంచ్ తత్వవేత)
“నిజాలను మాట్లాడడంపై నిషేధం ఉన్న వారి తరపున, నిజాలను ఇంకా గ్రహించని స్థితిలో ఉన్నవారి కోసం మేధావి నిజాలను మాట్లాడాడు. అతడు అంతఃసాక్షి, అతడే చైతన్యం, అతడే వాగ్దాటి" అని నాయకుల నైతికత'ను ప్రశ్నించాడు. "స్వాతంత్రం అంటే ఏమిటి | రాజకీయాల్లో వున్నవారు చెయ్యాల్సింది ఏమిటి, ఇతరులతో వ్యవహరిస్తున్నప్పుడు, పాటించాల్సిన పద్ధతి ఏమిటి, మొదలైనవి ఇంకా..." (మిల్లర్, 1994, 188) .............