₹ 100
కుల సమాజంలో పెత్తందారీ కులాల వారు దళితులపై సాగించే రకరకాల హింస, పీడన, వివక్ష తాలూకు వివిధ రూపాలు, వారి శ్రమ నిత్యం దోపిడీకి గురవ్వడం, దళిత స్త్రీల పై పెత్తందారీ కులాల వారు సాగించే లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు మొదలైన అంశలపైన కొత్త గొంతుతో సోని కవిత్వం వినిపిస్తుంది। ఇప్పుడు నయా బ్రాహ్మణవాద కొత్తరకం ఎత్తుగడ అయిన "దేశభక్తి" లో దాగున్న అప్రజాస్వామిక అణిచివేత విధానాలు, తినే తిండిపైన, మాట పైన సాగుతున్న నిర్బంధం। "పరువు" పేరున పెచ్చరిల్లుతున్న కుల దురహంకార హత్యలతో పాటు అంతరంగికంగా ఉద్యమాన్ని తమ సొంత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టి "అపనమ్మకాలు వండుతూ ఇస్తర్లు వేసే " దళిత దళారీల నైజం గురించికూడా సోని తన కవిత్వంలో నిర్మొహమాటంగా ఎండగొట్టాడు। అసలు కవిత్వం ఎందుకు రాయాలో, కవిత్వం నిర్వహించాల్సిన పాత్ర ఏమిటో సోనికి స్పష్టత వుంది।
- Title :Black Voice
- Author :Tangirala Sony
- Publisher :Samajika Parivarthana Kendram
- ISBN :MANIMN1146
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :90
- Language :Telugu
- Availability :instock