మొగల్ సామ్రాజ్యం పాలనలో గోల్కొండ కేంద్రంగా దక్కన్ సుబేదారుగా పని చేసిన అసఫ్ జా నిజాం ఉల్ ముల్క్ క్రీ.శ. 1724 లో, స్వతంత్రం ప్రకటించుకున్నాడు. మొగలులు బలహీనపడటమే కారణం. దక్కన్ పీఠభూమి మధ్యన సుమారు 8300 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో విశాలమైనది హైదరాబాద్ సంస్థానం.
అసఫ్ జాహీ నవాబుల పాలనా బలహీనతలు ఒకవైపు, మరొక వైపు మరాఠా రాజుల దండయాత్రలు, వేరొకవైపు మైసూరు నవాబులతో పోరులో బలహీనపడిన నవాబు ఆంగ్లేయులకు లోబడి పరిపాలన సాగించవలసిన పరిస్థితి ఏర్పడిరది.
. క్రీ.శ. 1800లో బ్రిటీష్ గవర్నర్ జనరల్ వెల్లస్లీ సైన్య సహకార పద్ధతిని ప్రకటించాడు. ఆంగ్లేయుల సైన్యం నవాబుకి దన్నుగా రాజధానిలో వుంటుంది. వారికి జీతభత్యాలు నవాబు చెల్లించాలి. సైన్య సహకార పద్ధతి ఒప్పందంలో భాగంగా నవాబు బ్రిటీష్ వారికి కర్నూలు, కడప, అనంతపురం, బళ్ళారి ప్రాంతాలను సమర్పించాడు. పన్ను వసూలు అధికారంతో పాటు చిన్న సంస్థానాలు, జమీందారులపై పెత్తనం బ్రిటిష్ వారి పరమైంది.
క్రీ.శ. 1798లోనే గుంటూరు బ్రిటీష్ వారి ఆధీనంలోకి వెళ్ళింది. గుంటూరు జిల్లా కలెక్టర్ రెవిన్యూ ఆదాయంపై దృష్టి సారించాడు. జిల్లాలోని జమీందారులు ఎస్టేట్లను భరణం యిచ్చి స్వాధీనంచేసుకున్నాడు...................