• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Boyakottamualu Pandredu

Boyakottamualu Pandredu By Karanam Balasubrahmanyam Pilali

₹ 275

"రణరంగం కానీ చోటు భూ

స్థలమంతా వేదికిన దొరకదు."

వేంగి చాళుక్యులలో రెండవ విజాయదాదిత్యుడు పండ్రెండు సంవత్సరములలో నూట ఎనిమిది యుద్ధములు చేసెనట. బహుళ నూట ఎనిమిది చోట్ల జరిగి ఉండవచ్చును. ఎంత రక్తపాతమో!

ఎంతటి మరణ హోమమో!

ఆ పాపపరిహారార్ధము నూట ఎనిమిది శివాలయములు కట్టించెనట. వాటికీ రాళ్ళెత్తిన కూలీలెవ్వరు? వారికిచ్చిన కూలి ఎంత? పని ఆలస్యమైనపుడు పడిన కొరడా దెబ్బలేన్ని!?

"గతమంతా తడిసె రక్తమును,

కాకుంటే కన్నీళ్లతో"

ఆ రక్తగాధలూ, ఆ కన్నీటి గాధలు మనము తెలుకొన్నప్పుడే మనకు మన చరిత్ర బోధపడును,

"ఇతిహాసపు చీకటి కోణం

అట్టడుగునపడి కాన్పింపని

కథలన్నీ కావాలిప్పుడు"

కాలం బండి చక్రాల క్రింద నలిగిపోయి, ప్రజ్నన్నయాయుగానికి చెందిన తెలుగువాడి చరిత్ర , శాస్త్రం, సాహిత్యం అన్ని కనుమరుగైపోయాయి. అదృష్టవశాత్తు శిలాసనంలో చోటు దొరకటం వల్ల క్రి.శ. 848 రచింపబడ్డ ఓ తెలుగు పద్యం కాలానికి ఎదురీది నిలిచింది. ఈ పండరంగాని అద్దంకి పద్యశాసనం గుండ్లకమ్మతీరంలో అద్దంకి వేయిస్థంభాల గుడి పరిసరాల్లో 1900 ప్రాంతంలో లభించింది. తెలుగుభాషకు భారత ప్రభుత్వం ప్రాచీనహోదా పట్టాన్ని కట్టబెట్టడానికి నిలువెత్తు సాక్ష్యంలా నిలిచిన ఈ శాసనం తెలుగు వారందరికీ ప్రీతిపాత్రమైనది. ప్రజ్ఞన్నయుగం క్రి.శ. 624 నుంచి క్రి.శ. 848 వరకు విస్తరించి బోయవీరుల తెలుగు చరిత్ర ఇన్నూరు సంవత్సరములలో ఆవిర్భవించి అభివృద్ధి చెంది ఒక వెలుగు వెలిగి కేవలం ఒకే ఒక నాటి యుద్దములో శాశ్వతముగా రూపుమాసిన బోయకొట్టమల చరిత్ర ఐన ఈ శాసనం చుట్టూ జిగిబిగి అల్లిక చేసి మీ కారకమలాల నలంకరించి ఈ నవలను రచించారు శ్రీ పిళ్ళేగారు.

  • Title :Boyakottamualu Pandredu
  • Author :Karanam Balasubrahmanyam Pilali
  • Publisher :Priyadarsini Prachuranalu
  • ISBN :MANIMN2233
  • Binding :Paerback
  • Published Date :2020
  • Number Of Pages :276
  • Language :Telugu
  • Availability :instock