ఓమ్ పరబ్రహ్మణే నమః. అనుగ్రహం
“ఆర్షవిద్యావిద్వన్మణి”
గుండ్ల పుండరీకాక్షరావు శర్మా, శ్రీ లలితా ఉపాసకులు, హైదరాబాద్. సెల్ : 9701886794.
శ్లో॥ సదాశివ సమారంభం- వ్యాస శంకర మధ్యమామ్,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరామ్.
శ్లో॥ వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషమ్,
పరాశరాత్మజం వందే శుక తాతం తపోనిధిమ్.
శ్లో॥ వ్యాసాయ విష్ణురూపాయ - వ్యాసరూపాయ విష్ణవే,
నమో వై బ్రహ్మ నిధయే - వాసిష్టాయ నమో నమః.
శ్లో॥ అచతుర్వదనో బ్రహ్మ -ద్విబాహురపరో హరిః,
అఫాలలోచనశ్శంభుః -భగవాన్ బాదరాయణః.
శ్లో॥ శ్రుతి స్మృతి పురాణానాం- ఆలయం కరుణాలయం
నమామి భగవత్పాదం - శంకరం లోకశంకరమ్.
శ్లో॥ శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే
సర్వదా సర్వథాఒస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్.
శ్రుతి స్మృతి ఉపనిషత్తులలోని బ్రహ్మజ్ఞాన సారమును 555 సూత్రములలో సూత్రబద్ధమైనవి బ్రహ్మసూత్రములు. ఇవి ఆధ్యాత్మిక విజ్ఞానములో పరాకాష్ఠ. ఉపనిషత్తులు అధ్యయనం చేసినవారికి పరమాత్మను గురించి దిశానిర్దేశమును చూపించి అద్వైత బ్రహ్మజ్ఞానమును కలిగించి పరమాత్మసాక్షాత్కారమునకు సహాయపడును. నాలుగు అధ్యాయములు 191 అధికరణములు 555 సూత్రములు గల ఈ బ్రహ్మజ్ఞానకలశమును...............