హైటెక్ దొంగ
కాలింగ్ బెల్ మ్రోగింది.
“ఇంత రాత్రివేళ ఎవరొచ్చారబ్బా?" ఆవులిస్తూ లేచి అన్నాడు బ్రహ్మానందం. “చుట్టాలేమో” అంది శ్రీలక్ష్మి.
"చెప్పా చెయ్యకుండా వూడిపడతారంటావా?"
"దొంగలంటారా?”
“వాళ్లకన్ని దమ్ములెక్కడివి? ఘరానాగా బెల్ కొట్టి మరీ ఇంట్లోకొచ్చి దోచుకోడానికి నేనేమైనా వెర్రి వెధవనా?”
మళ్లీ మ్రోగింది.
“ఏం చేద్దామంటారు? తలుపులో చిన్న కంత పెట్టించండీ, ఎవరొచ్చిందీ తెలుస్తుందీ. అంటే విన్నారు కాదు”
“నీకేం భయంలేదు గాని రా”
"నేనెందుకు? తోడు కోసమా?”
"కాదోయ్. నేనెలా మేనేజ్ చేస్తానో చూద్దువు గాని. అవసరపడితే రెండు జెల్లకాయ
తెలిస్తాను. దెబ్బకి కళ్లు తిరిగి పడతాడు. రా మరి!”.............