• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Brahmanikam Chalam Sahityam Navalalu

Brahmanikam Chalam Sahityam Navalalu By Chalam

₹ 100

బ్రాహ్మణీకం

సుందరమ్మ వంశం చాలా పూర్వాచారపరాయణ భూయిష్టం. లోక మంతా, యే విషయాలు వుత్త మూఢనమ్మకాలంటుందో వాటిల్లో వాళ్లకి అమితమైన విశ్వాసం. వారానికి ఒకసారన్నా వాళ్లింటో ఎవరికో ఒకరికి ఒక్క దెయ్యమన్నా కనపడి తీరుతుంది. అందులో ఆ దెయ్యాలన్నీ దుష్ట మైనవి. పూర్వంనించీ కూడా ఆ వంశానికి భయంకర శాపమున్నదనీ, మగవాళ్లు చావడమూ, ఆడవాళ్లు వితంతువులు కావడమూ నిశ్చయమనీ, వాళ్ళకి గట్టి నమ్మకం. ఆపత్తులు వాళ్ళకి మామూలైపోయినాయి.

ఆ వంశంలో చచ్చినవాళ్ళ కెవరికీ ఊర్ధ్వలోక నివాసంగాని, పునర్జన్మలు పో గాని వున్నట్టు లేవు. అందరూ ఆ యింటి చుట్టుపక్కలే చూర్లనూ, చెట్లనూ, పట్టుకు గబ్బిలాల వలె వేళ్లాడుతో, వొంతుల ప్రకారం జ్యోతిషాలలోనూ, సోదెలలోనూ, పూనడాలలోనూ తమ సంతతివారితో సంభాషిస్తో, తమ కోర్కెలు తెలుపుకుంటో, తమ కోపాలకీ, శాపాలకీ, కారణాలు వివరించు కుంటా వుంటారు.

"ఏడేళ్ల తొమ్మిది నెలల మూడురోజుల వెనక మీరు అట్లు వొండుకుని, నాకు అట్లు యిష్టమని తెలిసివుండికూడా, నాకు పెట్టక, అన్నీ మీరే తిన్నారు.....................

  • Title :Brahmanikam Chalam Sahityam Navalalu
  • Author :Chalam
  • Publisher :Amaravti Publications
  • ISBN :MANIMN6110
  • Binding :Papar Back
  • Published Date :Jan, 2025
  • Number Of Pages :103
  • Language :Telugu
  • Availability :instock