• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Bramaram

Bramaram By Sri Dharan Kanduri

₹ 270

దేవీ భ్రమరాంబ అవతార విశేషములు?

 

పురాణకాలంలో ఒకసారి నారదమహర్షి, వైకుంఠానికివెళ్ళి ఆపై అక్కడ శేషపాన్పుపై పవళించి ఉన్న మహావిష్ణువుకి నమస్కరించి ఆయనను ఆదిపరాశక్తి యొక్క లీలల గురించి మరియు అద్భుతమైన ఆమె అవతారాల గురించి తెలియజేయమని ప్రార్ధించాడు. మూడులోకాలకు మాతృమూర్తి అయిన ఆ మహాశక్తి గురించి తెలియ జేయటానికి అంగీకరించిన మహావిష్ణువు, చిరునవ్వులు చిందిస్తూ నారద మహర్షితో ఇలా చెప్పటం ప్రారంభించాడు.....

"ఓ నారదా! ఆదిపరాశక్తి యొక్క మాహాత్యం గురించి సంపూర్తిగా చెప్పటం నాతో సహా ఏ దైవానికి సాధ్యంకాదు. అయినప్పటికీ, నాకు తెలిసినంతవరకు ఆ మహామాయ గురించి నీకు తెలియజేస్తాను. ఆ ఆదిపరాశక్తి తన నిజమైన భక్తుల్ని తన కన్నబిడ్డలులాగా లాలించి పాలిస్తుంది. తన భక్తులు సంపదలు అడిగితే అపరిమితంగా అందిస్తుంది. మోక్షాన్ని కోరితే నిస్సందేహంగా వారికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆమె - దుష్టశిక్షణ చెయ్యటంకోసం ఎన్నో యుగాలలో విభ్నిమైన రూపాలను ధరించి దుష్టులను శిక్షించి, ధర్మాన్ని పరిరక్షించింది. ఆమె ధరించిన అవతారాలన్నింటిలోనూ అతిశక్తివంతమైనది మరియు భక్తుల కళ్ళకు ఆనందాన్ని కలిగించేది అయిన 'భ్రమరీదేవి" అవతారమని తెలుసుకో. పురాణకాలంలో ఒకసారి -రాక్షస రాజ్యాన్ని అరుణాసురుడు అనే ఒక రాక్షసుడు పరిపాలించేవాడు. అప్పటికి ఎన్నో తరాలుగా రాక్షసులను ఏదోఒకవిధంగా అణచివేసి, అంతం చేస్తున్న దేవతల మీద తన చిన్నతనం నుండి విపరీతమైన ద్వేషాన్ని, పగను పెంచుకున్న ఆ అరుణాసురుడు - తనకు యుక్తవయస్సు రాగానే తన కులగురువైన శుక్రాచార్య సలహాతో - హిమాలయాలలో ఉన్న గంగానదీ తీరానికి చేరుకుని అక్కడ గాయత్రీ మంత్రాన్ని పఠిస్తూ బ్రహ్మదేవుడి గురించి అనేక సంవత్సరాలపాటు అతి ఘోరమైన తపస్సు చేసాడు. అయినప్పటికీ, బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాలేదు. దాంతో, అతడు మూడు సంవత్సరాలపాటు తన శరీరంలో ఉన్న పంచ ప్రాణాలను స్తంభింపచేసి ఆపై, ఎండు ఆకులను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ అత్యంత కఠినమైన తపస్సు చేసాడు. ఆ తరువాత కేవలము వాయువును మాత్రమే ఆహారంగా తీసుకుంటూ పదివేల సంవత్సరాల పాటు "గాయత్రి" మంత్రంతో గాయత్రీదేవిని గురించి తపస్సు చేసాడు. ఆ తరువాత రోజుకి అరుచుక్కల జలాన్ని ఆహారంగా తీసుకుని, ఇంకొక................

  • Title :Bramaram
  • Author :Sri Dharan Kanduri
  • Publisher :Sri Dharan Kanduri
  • ISBN :MANIMN5144
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :286
  • Language :Telugu
  • Availability :instock